- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BBL Final : 39 బంతుల్లోనే సెంచరీ.. బీబీఎల్ ఫైనల్‌లో మిచెల్ఓ వెన్ విధ్వంసం
బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) టైటిల్‌ను హోబర్ట్ హరికేన్స్ కైవసం చేసుకుంది.

దిశ, స్పోర్ట్స్ : బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్) టైటిల్‌ను హోబర్ట్ హరికేన్స్ కైవసం చేసుకుంది. ఫైనల్‌లో స్నిడ్నీ థండర్‌ను ఓడించి తొలిసారిగా బీబీఎల్ టైటిల్‌ను దక్కించుకుంది. సోమవారం జరిగిన ఫైనల్‌లో 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా సిడ్నీ థండర్ నిర్ణీత 20 ఓవర్లలో 182/7 స్కోరు చేసింది. జాసన్ సంఘా(67), కెప్టెన్ డేవిడ్ వార్నర్(48) మెరిశారు. అనంతరం 183 పరుగుల లక్ష్యాన్ని హరికేన్స్ మూడే వికెట్లు కోల్పోయి 14.1 ఓవర్లలోనే ఛేదించింది. బీబీఎల్ టైటిల్ నిరీక్షణకు తెరదించడంలో ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ ఓవెన్ కీలక పాత్ర పోషించాడు. ఛేదనలో అతను విధ్వంసం సృష్టించాడు. మిడిలార్డర్‌లో వచ్చే ఓవెన్ ఓపెనర్‌గా వచ్చి సిడ్నీ బౌలర్లను ఊచకోతకోశాడు. ఆకాశమే హద్దుగా చెలరేగిన అతను ఏ బౌలర్‌ను వదల్లేదు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. టోర్నీ చరిత్రలో ఫాసెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. మొత్తంగా 42 బంతుల్లో 108 రన్స్ చేశాడు. అందులో 4 ఫోర్లు, 11 సిక్స్‌లు ఉండటం గమనార్హం. అతని స్ట్రైక్‌రేటు 257గా ఉండటం విశేషం. ఓవెన్ ఊచకోతతో హరికేన్స్ భారీ విజయం సాధించడంతోపాటు టైటిల్ సొంతం చేసుకుంది.






