మార్ష్ బ్రదర్స్ సరికొత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి !

by velandi.Saikiran |   (  Updated:2025-05-22 22:45:40  IST  )

ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) గురువారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో ( Gujarat Titans

మార్ష్ బ్రదర్స్  సరికొత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి !
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ లో ( IPL 2025) గురువారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ వర్సెస్ లక్నో ( Gujarat Titans vs Lucknow ) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో... అద్భుతంగా ఆడిన లక్నో... గుజరాత్ టైటాన్స్ జట్టును చిత్తు చేసింది. ఏకంగా 33 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్ పైన లక్నో గెలిచింది. అయితే ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆసక్తికర సంఘటన జరిగింది.

ఐపీఎల్ చరిత్రలో... మార్ష్ బ్రదర్స్ ( Marsh Brothers ) సరికొత్త రికార్డు సృష్టించారు. గుజరాత్ జట్టు పైన... గురువారం జరిగిన మ్యాచ్ లో మిచెల్ మార్ష్.. అద్భుతమైన సెంచరీ చేసిన సంగతి తెలిసిందే. 64 బంతుల్లో 117 పరుగులు చేశాడు మార్ష్. ఇందులో ఎనిమిది సిక్సర్లు, అలాగే 10 బౌండరీలు ఉన్నాయి. అయితే మార్ష్ తరహాలోనే... అతని సోదరుడు షాన్ మార్ష్ ( Shaun Marsh) కూడా గతంలో సెంచరీ చేసి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు.

2008 సంవత్సరంలో పంజాబ్ జట్టు తరుపున ఆడిన షాన్ సెంచరీ చేశాడు. ఇక ఇప్పుడు లక్నో తరఫున మిచెల్ సెంచరీ కొట్టేశాడు. ఇలా ఐపిఎల్ టోర్నమెంట్ లో... ఇద్దరు బ్రదర్స్ సెంచరీలు కొట్టిన దాఖలాలు లేవు. ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఈ మార్ష్ బ్రదర్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు.

Next Story