- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Champions Trophy : ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. చాంపియన్స్ ట్రోఫీకి ఆ విధ్వంసకర ఆటగాడు దూరం
చాంపియన్స్ ట్రోఫీ ముందు ఆస్ట్రేలియాకు ఊహించిన భారీ షాక్ తగిలింది

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ మరో 19 రోజుల్లో ప్రారంభంకానుంది. ఈ మెగా ఈవెంట్‌కు ముందు ఆస్ట్రేలియాకు ఊహించిన భారీ షాక్ తగిలింది. చాంపియన్స్ ట్రోఫీకి ఎంపికైన ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. వెన్ను గాయం కారణంగా అతను ఐసీసీ టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) శుక్రవారం వెల్లడించింది.
‘మార్ష్ నడుము నొప్పి ఇంకా తీవ్రమైంది. రిహాబిలిటేషన్‌లో గాయం తగ్గలేదు. దీంతో సెలెక్షన్ ప్యానెల్, మెడికల్ టీమ్ అతన్ని చాంపియన్స్ ట్రోఫీ నుంచి తప్పించాలని నిర్ణయించాం. అతను తిరిగి ఆడాలే అతని పునరావాస సమయాన్ని పొడిగించాం.’ అని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అయితే, మార్ష్ రిప్లేస్‌మెంట్‌ను ఇంకా ప్రకటించలేదు. తుది జట్ల ప్రకటనకు ఈ నెల 12 వరకు గడువు ఉండగా.. ఆ లోపు మార్ష్ స్థానాన్ని భర్తీ చేస్తామని సీఏ పేర్కొంది.
భారత్‌తో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనే మార్ష్ వెన్ను నొప్పితో బాధపడ్డాడు. దీంతో ఐదో టెస్టులో ఆస్ట్రేలియా అతన్ని పక్కనపెట్టింది. ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీకి నాటికి కోలుకోవాలనే ఉద్దేశంతో బిగ్‌బాష్ లీగ్ మ్యాచ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. కానీ, గాయం తగ్గకపోవడంతో చాంపియన్స్ ట్రోఫీ మొత్తానికి దూరమయ్యాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడే మార్ష్‌ను కోల్పోవడం ఆసిస్‌కు భారీ దెబ్బే.
మరోవైపు, మార్ష్ ఐపీఎల్ ఆడటంపై కూడా సందిగ్ధం నెలకొంది. వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని రూ.3.4 కోట్లకు కొనుగోలు చేసింది. చాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే ఐపీఎల్ మొదలవుతుండటంతో ఆ నాటికి అతను పూర్తిగా ఫిట్‌నెస్ సాధిస్తాడా? అన్న అనుమానాలు నెలకొన్నాయి.






