ఆగస్టులో బంగ్లా టూరుకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్

by Harish |
ఆగస్టులో బంగ్లా టూరుకు టీమిండియా.. షెడ్యూల్ రిలీజ్
X

దిశ, స్పోర్ట్స్ : భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య వైట్‌బాల్ సిరీస్ ఖరారైంది. భారత జట్టు ఆగస్టులో బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ టూరు షెడ్యూల్‌ను బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ) తాజాగా ప్రకటించింది. బంగ్లాదేశ్ పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు,మూడు టీ20లు ఆడనుంది. టీమిండియాతో తొలి ద్వైపాక్షిక టీ20 సిరీస్‌కు బంగ్లాదేశ్ తొలిసారి ఆతిథ్యమివ్వనుంది. వన్డే, టీ20 మ్యాచ్‌లకు మీర్పూర్, ఛటోగ్రామ్ వేదికల్లో జరగనున్నాయి. ఆగస్టు 17, 20, 23 తేదీల్లో వన్డే మ్యాచ్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత ఆగస్టు 26, 29, 31 తేదీల్లో టీ20 పోరులో ఇరు జట్లు తలపడనున్నాయి. ‘భారత్‌తో సిరీస్ మా హోం క్యాలెండర్‌లో ఉత్తేజకరమైన, ఎదురుచూస్తున్న సిరీస్. ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో భారత జట్టు బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. భారత్, బంగ్లా పోరును ఇరు దేశాల అభిమానులు ఎంజాయ్ చేస్తారు.’ అని బీసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిజామ్ ఉద్దిన్ చౌదరి తెలిపారు. బంగ్లా పర్యటన కోసం ఆగస్టు 13న భారత జట్టు ఢాకాకు చేరుకోనుంది.




Next Story

Most Viewed