- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వివాదంగా మారిన పాక్ బ్యాటర్ రనౌట్..ఇది గల్లీ క్రికెట్ అంటూ
పాక్ ఆటగాడు సల్మాన్ ఆఘాను మిరాజ్ వివాదాస్పదంగా రనౌట్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ తో జరిగిన రెండవ వన్డేలో పాకిస్తాన్ ప్లేయర్ సల్మాన్ అఘా ( Salman Agha ) రన్ ఔట్ కావడం ఇప్పుడు వివాదంగా మారింది. మహ్మద్ రిజ్వాన్ ఆడిన బంతి నేరుగా బౌలర్ మిరాజ్ వైపు వెళ్ళింది. ఈ క్రమంలో నాన్ స్ట్రైకర్ ఎండ్ లో సల్మాన్ అఘా ఉన్నాడు. అయితే బాల్ ముందుకు వచ్చిన నేపథ్యంలో పరుగు కోసం సల్మాన్ అఘా ప్రయత్నించాడు. ఈ క్రమంలో మిరాజ్ ( Miraz) బాల్ ను ఆపేందుకు కాలు అడ్డుపెట్టి, సల్మాన్ అఘాను కదలకుండా చేసే ప్రయత్నం చేశాడు. ఈ నేపథ్యంలో సల్మాన్ అఘా దానిని తీసి బౌలర్ కు ఇచ్చే ప్రయత్నం కూడా చేశాడు.
క్రికెట్ చరిత్రలో ఫన్నీ రనౌట్
కానీ అంతలోనే బంగ్లా బౌలర్ మిరాజ్ బంతిని లాక్కొని స్టంప్స్ కొట్టి ఔట్ చేశాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు దారుణంగా కామెంట్లు పెడుతున్నారు. గల్లీలో కూడా ఇంత కంటే బాగా క్రికెట్ ఆడతారని చురకలు అంటిస్తున్నారు. బంతిని ఇవ్వబోయిన సల్మాన్ అఘాను చిన్నపిల్లడిని చేసి ఔట్ చేశారు అంటూ మరి కొంత మంది కామెంట్లు చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య రెండో వన్డే ఢాకా వేదికగా జరిగింది. ఇందులో అద్భుతంగా రాణించిన పాకిస్తాన్ 128 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో 3 వన్డేల సిరీస్ 1-1 గా సమం అయింది. ఈ రెండు జట్ల మధ్య మరో వన్డే మ్యాచ్ జరగాల్సి ఉంది.






