వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన మీరాబాయి చాను

by Harish |

భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది.

వరల్డ్ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచిన  మీరాబాయి చాను
X

దిశ, స్పోర్ట్స్ : భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించింది. నార్వేలో జరుగుతున్న ఈ టోర్నీలో ఆమె 48 కేజీల విభాగంలో పాల్గొని సత్తాచాటింది. స్నాచ్‌లో 84 కిలోలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్‌లో 115 కిలోలు మోసింది. మీరా మొత్తం 199 కేజీల బరువు ఎత్తి రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ గెలిచింది. దాదాపు ఏడాది విరామం తర్వాత ఆగస్టులో పునరాగమనం చేసిన మీరా కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన విషయం తెలిసిందే. 2017లో జరిగిన వరల్డ్ చాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించగా.. 2022లో కాంస్యం కైవసం చేసుకుంది. ఇక, నార్త్ కొరియా వెయిట్‌లిఫ్టర్ రి సాంగ్ గమ్ 213 కిలోలు ఎత్తి గోల్డ్ మెడల్ ఎగరేసుకపోయింది. థాయిలాండ్‌కు చెందిన థాన్యథాన్ సుక్చరోయెన్(198 కిలోలు) కాంస్యం గెలిచింది.


Next Story