మీరాబాయి చానుకు స్వర్ణం.. మూడు జాతీయ రికార్డులు బద్దలు

by Phanindra |

నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి చానుకు స్వర్ణం దక్కింది. ఆమె మూడు జాతీయ రికార్డులు బద్దలు కొట్టింది.

మీరాబాయి చానుకు స్వర్ణం.. మూడు జాతీయ రికార్డులు బద్దలు
X

దిశ, స్పోర్ట్స్: భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను ఏకంగా మూడు రికార్డులు బద్దలు కొట్టింది. యూపీలోని మోడీనగర్‌లో జరిగిన నేషనల్ వెయిట్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో మీరాబాయి అదరగొట్టింది. మహిళల 48 కేజీల స్నాచ్‌ విభాగంలో 89 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జర్క్‌లో 116 కేజీల వెయిట్ లిఫ్ట్ చేసింది. మొత్తం 205 కేజీలతో స్వర్ణం సాధించడంతోపాటు స్నాచ్, క్లీన్ అండ్ జర్క్, టోటల్.. మూడు విభాగాల్లో జాతీయ స్థాయి రికార్డులు నెలకొల్పింది. 2025 వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో ఆమె టోటల్ 199 కేజీలు ఎత్తి స్వర్ణం నెగ్గగా.. ఇప్పుడు అదనంగా మరో 6 కేజీలు ఎత్తడం గమనార్హం. రెండో స్థానంలో నిలిచిన రాధాసోని.. చాను కన్నా 22 కేజీలు తక్కువ వెయిట్ లిఫ్ట్ చేసింది.

Next Story