- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > Mike Tyson : చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. హెల్త్ కండిషన్‌పై మైక్ టైసన్ ఎమోషనల్ ట్వీట్
Mike Tyson : చావు అంచుల వరకు వెళ్లొచ్చా.. హెల్త్ కండిషన్‌పై మైక్ టైసన్ ఎమోషనల్ ట్వీట్
by Sathputhe Rajesh |
ఆరోగ్య సమస్యలతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చినట్లు మైక్ టైసన్ తెలిపాడు.

X
దిశ, స్పోర్ట్స్ : ఆరోగ్య సమస్యలతో చావు అంచుల వరకు వెళ్లి వచ్చినట్లు మైక్ టైసన్ తెలిపాడు. బాక్సర్ జేక్ పాల్‌తో ఓటమి అనంతరం లెజెండరీ బాక్సర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా స్పందించాడు. ఓటమిలో విజయాన్ని చూసుకున్నట్లు తెలిపాడు. చివరి సారిగా రింగ్‌లో అడుగుపెట్టినందుకు చింతించడం లేదన్నాడు. జూన్‌లో చావు అంచుల వరకు వెళ్లాను. 8 సార్లు రక్త మార్పిడి చేయించుకున్నాను. శరీరంలో నుంచి చాలా రక్తం పోయింది. 11 కిలోల బరువు తగ్గాను. ఫైట్ చేసేందుకు ఆరోగ్య సమస్యలతో పోరాడి గెలిచాను. నా వయసులో సగం ఉన్న వ్యక్తితో డల్లాస్‌లోని కౌబాయ్ స్టేడియంలో మునివేళ్లపై 8 రౌండ్లు నేను చేసిన పోరాటాన్ని నా పిల్లలు చూశారన్నాడు. శిక్షణను మొదటి నుంచి ప్రారంభించాల్సి ఉందని.. తాను సాధించిన దాంతో సంతృప్తితో ఉన్నట్లు వెల్లడించాడు.
Next Story






