- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టోక్స్ ఉంటే గెలిచేవాళ్లం.. అతను లేకపోవడంతో టీం తడబడింది: మైఖేల్ వాన్
ఓవల్ టెస్టులో బెన్ స్టోక్స్ ఆడి ఉంటే తామే గెలిచేవాళ్లమని, అతను లేకపోవడంతో టీం తడబడిందని మాజీ దిగ్గజం మైఖేల్ వాన్ అన్నాడు.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్ టెస్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ కనుక ఓవల్ టెస్టులో ఆడి ఉంటే.. కచ్చితంగా తమ టీమే గెలిచి ఉండేదని ఇంగ్లండ్ మాజీ దిగ్గజం మైఖేల్ వాన్ అన్నాడు. ఈ మ్యాచు రెండో ఇన్నింగ్సులో ఆధిపత్యం చెలాయించిన ఇంగ్లండ్.. చివర్లో అనూహ్యంగా ఓటమి చవిచూసింది. ఈ టెస్టులో గాయం కారణంగా కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆడలేదు. చివరి రోజు 35 పరుగులు చేయలేక పోయిన ఇంగ్లండ్.. 6 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.
చివరి రోజు మార్నింగ్ సెషన్‌లో ఇంగ్లండ్ జట్టు ఆందోళన చెందిందని వాన్ చెప్పాడు. ‘బెన్ స్టోక్స్ కనుక టీంలో ఉండుంటే ఈ మ్యాచ్ మనం గెలిచేవాళ్లం. ఈ టీం మెంటాలిటీలో స్టోక్స్ కీలక పాత్ర పోషిస్తాడు. చివరి రోజు ఇంగ్లండ్ జట్టు ఆందోళన చెంది.. తమ ఆటతీరులో తడబడింది’ అని వాన్ వివరించాడు. ఈ సిరీసులో నాలుగు టెస్టులు ఆడిన స్టోక్స్ 140 ఓవర్లు బౌలింగ్ చేసి 25.24 సగటుతో 17 వికెట్లు తీసుకున్నాడు. అలాగే బ్యాటుతో 43.43 యావరేజ్‌తో 304 పరుగులతో రాణించాడు.






