చాంపియన్స్ ట్రోఫీ గెలిచేది ఆ జట్టే.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జోస్యం

by Harish |

టీమ్ ఇండియానే చాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ క్లార్క్ జోస్యం చెప్పాడు.

చాంపియన్స్ ట్రోఫీ గెలిచేది ఆ జట్టే.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ జోస్యం
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియానే చాంపియన్స్ ట్రోఫీ గెలుస్తుందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మైకెల్ క్లార్క్ జోస్యం చెప్పాడు. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న అతను అభిప్రాయాలను పంచుకున్నాడు. ‘భారత్ విజేతగా నిలుస్తుందని చెబుతున్నా. రోహిత్ ఫామ్‌లోకి వచ్చాడు. అతను పరుగులు చేస్తే చూడటానికి బాగుంది.టోర్నీలో అతనే అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. భారత్‌‌కు అతని అవసరం ఉంది.’ అని తెలిపాడు. అలాగే, టాప్ వికెట్ టేకర్, ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఆటగాళ్లను కూడా మైకేల్ అంచనా వేశాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలుస్తాడని, ఇంగ్లాండ్ జట్టులో అతనూ సూపర్ స్టార్ అని చెప్పాడు. ఇక, ఆస్ట్రేలియా ప్లేయర్ ట్రావిస్ హెడ్ భీకర ఫామ్‌లో ఉన్నాడని, అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలుస్తాడని తెలిపాడు.


Next Story