- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MI Vs SRH: దంచికొడుతున్న అభిషేక్, హెడ్.. చుక్కలు చూస్తున్న ముంబై బౌలర్లు
ముంబై ఇండియన్స్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ రికార్డు స్థాయి సెంచరీతో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎదుట 244 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2026లో భాగంగా వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ పరుగుల వరద పారించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ముంబై, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోరును సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించాలంటే 244 పరుగులు చేయాల్సి ఉంది. ముంబై ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ అద్భుతమైన ఫామ్‌ను కనబరిచాడు. కేవలం 55 బంతుల్లోనే 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 123 పరుగులు చేసి సన్‌రైజర్స్ బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టాడు. మరో ఓపెనర్ విల్ జాక్స్ 22 బంతుల్లో 46 పరుగులతో మెరుపులు మెరిపించాడు. చివర్లో కెప్టెన్ హార్దిక్ పాండ్యా (15 బంతుల్లో 31) తనవంతు సహకారాన్ని అందించాడు. ఇక సన్‌రైజర్స్ బౌలర్లలో ప్రఫుల్ హింగే రెండు వికెట్లు తీయగా.. నితీష్ కుమార్ రెడ్డి, షకీబ్ హుస్సేన్, ఈషన్ మలింగ తలో వికెట్ పడగొట్టారు. కెప్టెన్ పాట్ కమిన్స్ పొదుపుగా బౌలింగ్ చేసినప్పటికీ వికెట్లు తీయలేకపోయాడు.
ఉతికారేస్తున్న ఎస్ఆర్‌హెచ్ ఓపెనర్లు..
భారీ విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా ధీటుగానే సమాధానమిస్తోంది. తాజా సమాచారం ప్రకారం, సన్‌రైజర్స్ 6 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 92 పరుగులు చేసింది. ఓపెనర్లు ట్రావిస్ హెడ్ (48), అభిషేక్ శర్మ (36) పరుగులతో క్రీజ్‌లున్నారు. ఇద్దరూ ముంబై బౌలర్లపై ఎదురుదాడి చేస్తూ సిక్సర్ల మోత మోగిస్తున్నారు. బౌలర్లు ఎవరు అనేది చూడకుండా బంతి బౌండరీ అవతలే అన్నట్లుగా వారు భీకరంగా బ్యాటింగ్ చేస్తున్నారు. సన్‌రైజర్స్ విజయం సాధించాలంటే ఇంకా 82 బంతుల్లో 152 పరుగులు చేయాల్సి ఉంది.






