MI Vs RCB: తడబడిన ముంబై బ్యాట్స్‌మెన్లు.. ఆర్సీబీ విజయలక్ష్యం ఎంతంటే?

by Kema Shiva Kumar |

ఐపీఎల్ 2026లో భాగంగా రాయ్‌పూర్‌లో ఆర్సీబీ, ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భువనేశ్వర్ కుమార్ 4 వికెట్లతో చెలరేగారు.

MI Vs RCB: తడబడిన ముంబై బ్యాట్స్‌మెన్లు.. ఆర్సీబీ విజయలక్ష్యం ఎంతంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రాయ్‌పూర్‌లో వేదికగా జరగుతున్న కీలక పోరులో టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ముందుగా రజత్ పటిదార్ బౌలింగ్ ఎంచుకున్నారు. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఆర్సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్‌తో ముంబై బ్యాటర్లను కట్టడి చేశారు. తన 4 ఓవర్లలో కేవలం 23 పరుగులే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టారు. రోహిత్ శర్మ (22), సూర్యకుమార్ యాదవ్ (0) వంటి స్టార్ ఆటగాళ్లు భువీ ధాటికి తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.

ముంబైని ఆదుకున్న తిలక్, నమన్..

28 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ముంబైని తిలక్ వర్మ (57), నమన్ ధీర్ (47) ఆదుకున్నారు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి గౌరవప్రదమైన స్కోరు అందించారు. భువనేశ్వర్‌తో పాటు జోష్ హాజిల్‌వుడ్, రసిఖ్ సలాం చెరో వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌తో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అత్యధిక ఐపీఎల్ మ్యాచ్‌లు (278) ఆడిన ఎం‌ఎస్ ధోని రికార్డును సంయుక్తంగా సమం చేశారు.

Next Story