MI Vs RCB: కోహ్లీ గోల్డెన్ డక్.. ఉత్కంఠగా సాగుతున్న ఆర్సీబీ ఛేజింగ్

by Kema Shiva Kumar |

IPL 2026లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న ఉత్కంఠ పోరులో ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గోల్డెన్ డక్ అయి షాకిచ్చారు.

MI Vs RCB: కోహ్లీ గోల్డెన్ డక్.. ఉత్కంఠగా సాగుతున్న ఆర్సీబీ ఛేజింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్-2026లో భాగంగా రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరుగుతున్న మ్యాచ్ ఆసక్తికరంగా మారుతోంది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ, ప్రస్తుతం 12.1 ఓవర్లలో 4 కీలక వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మొదటి బంతికే అవుటై అభిమానులను నిరాశపరిచారు. దీపక్ చాహర్ వేసిన బంతికి కోహ్లీ అవుట్ అవ్వగా, కొద్దిసేపటికే దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ కూడా పెవిలియన్ చేరారు.

కాగా, అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. తిలక్ వర్మ (57), నమన్ ధీర్ (47) పోరాడటంతో ముంబై గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ అద్భుతమైన స్పెల్ వేశారు. కేవలం 23 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ముంబైని దెబ్బతీశారు. ప్రస్తుతం ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే విజయానికి 47 బంతుల్లో 73 పరుగులు కావాలి. క్రీజ్‌లో క్రునాల్ పాండ్యా (41*), జితేష్ శర్మ (0*) ఉన్నారు. ముంబై బౌలర్ దీపక్ చాహర్, కార్బిన్ బాష్ చెరో రెండు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టును దెబ్బకొట్టారు.

Next Story