ఫోర్త్ అంపైర్‌ను దూషించిన పొలార్డ్.. చర్యలు తీసుకున్న నిర్వాహకులు

by Harish |

ఫోర్త్ అంపైర్‌ను దూషించిన పొలార్డ్.. చర్యలు తీసుకున్న నిర్వాహకులు
X

దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్‌కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించింది. పంజాబ్ కింగ్స్‌తో గురువారం జరిగిన మ్యాచ్‌లో అతను ఫోర్త్ అంపైర్‌ను దూషించినందుకు చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతపెట్టడమే కాకుండా ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ముంబై ఇన్నింగ్స్‌లో 19వ ఓవర్‌లో పొలార్డ్ ఫోర్త్ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా ఫోర్త్ అంపైర్‌తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలం వాడినట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ని పొలార్డ్ ఉల్లంఘించాడని, అతను కూడా తన తప్పును అంగీకరించాడని తెలిపింది. కాగా ఆ మ్యాచ్‌లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.


Next Story