- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆస్ట్రేలియా పర్యటనకు భారత అండర్-19 జట్టు ప్రకటన.. హైదరాబాద్ కుర్రాడికి చాన్స్
సెప్టెంబర్‌లో భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది.

దిశ, స్పోర్ట్స్ : సెప్టెంబర్‌లో భారత అండర్-19 జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డే గేములు, రెండు మల్టీ డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ పర్యటనకు బీసీసీఐ బుధవారం భారత అండర్-19 జట్టును ప్రకటించింది. ముంబై బ్యాటర్ ఆయుశ్ మాత్రేను సారథిగా కొనసాగించింది. ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనను ఆయుశ్ జట్టును నడిపించడంలో సక్సెస్ అయ్యాడు. యూత్ వన్డే సిరీస్ 3-2తో భారత్ సొంతమైంది. రెండు టెస్టుల సిరీస్ డ్రా చేసుకుంది. విహాన్ మల్హోత్రాను వైస్ కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లాండ్‌లో పర్యటించిన వైభవ్ సూర్యవంశీ, అభిగ్యాన్, రాహుల్ కుమార్, హర్వాన్ష్ సింగ్, అంబ్రీశ్, కనిష్క్, హెనిల్ పటేల్, దీపేశ్, అన్మోల్‌జీత్, నమన్ పుష్పక్ తమ స్థానాలను పదిలం చేసుకున్నారు. మొత్తంగా 17 మందిని ఎంపిక చేశారు. మరో ఐదుగురిని స్టాండ్ బై ప్లేయర్లుగా సెలెక్ట్ అయ్యారు. హైదరాబాద్ కుర్రాడు అలంక్రిత్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఎంపికయ్యాడు. సెప్టెంబర్ 21, 24, 26 తేదీల్లో వన్డే గేములు జరగనున్నాయి. సెప్టెంబర్ 30- అక్టోబర్ 3 వరకు తొలి మల్టీ డే మ్యాచ్, అక్టోబర్ 7-10 వరకు రెండో మల్టీ డే మ్యాచ్ జరుగుతాయి.
భారత అండర్-19 జట్టు : ఆయుశ్ మాత్రే(కెప్టెన్), విహాన్ మల్హోత్రా, వైభవ్ సూర్యవంశీ, వేదాంత్ త్రివేది, రాహుల్ కుమార్, అభిగ్యాన్ కుండు, హర్వాన్ష్ సింగ్, ఆర్ఎస్ అంబ్రీశ్, కనిష్క్ చౌహాన్, నమన్ పుష్పక్, హెనిల్ పటేల్, దీపేశ్, కిషన్ కుమార్, అన్మోల్‌జీత్ సింగ్, ఖిలాన్ పటేల్, ఉద్దవ్ మోహన్, అమన్ చౌహాన్.
స్టాండ్ బై ప్లేయర్లు : యుదాజిత్ గుహ, లక్ష్మణ్, బి.కె. కిశోర్, అలంక్రిత్, ఆర్నవ్.






