- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Messi: టీ 20 ప్రపంచకప్ టికెట్ విడుదల చేసిన మెస్సీ.. ప్రధానితో భేటీ రద్దు
‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా అర్జెంటనా దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: ‘గోట్ టూర్ ఆఫ్ ఇండియా’లో భాగంగా అర్జెంటనా దిగ్గజ ఫుట్‌బాల్ క్రీడాకారుడు లియోనెల్ మెస్సీ భారత్‌లో పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం ఢిల్లీలో మెస్సీ బృందం అడుగుపెట్టింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో అభిమానులతో సందడి చేసింది. ఈ మేరకు తన బృందంతో మెస్సీ.. ఐసీసీ అధ్యక్షుడు జై షా, ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖ గుప్తాతో కలిసి టీ 20 ప్రపంచకప్ టికెట్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మెస్సీకి జై షా బ్యాట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చారు. ఆ తర్వాత ప్రముఖులతో ఫొటోషూట్‌లో పాల్గొన్నారు.
ఇక, అడిడాస్ కంపెనీ కార్యక్రమంలో మెస్సీ టీమ్ పాల్గొన్నది. అనంతరం వాంతార వణ్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని సందర్శించింది. ఈ పర్యటనలో భాగంగా చివరలో భారత ప్రధాని నరేంద్ర మోడీతో మెస్సీ బృందం పాల్గొనాల్సి ఉండగా, ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లడంతో ఆ ప్రోగ్రామ్ రద్దు అయింది. కాగా, ఢిల్లీలో మెస్సీ సందడి చేసిన ఫోటోలు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఫోటోల కోసం క్లిక్ చేయండి






