hockey : ఉత్కంఠభరిత మ్యాచ్‌లో బెల్జియంపై సూపర్ విక్టరీ.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్

by Harish |

హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు హవా కొనసాగుతోంది.

hockey : ఉత్కంఠభరిత మ్యాచ్‌లో బెల్జియంపై సూపర్ విక్టరీ.. సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
X

దిశ, స్పోర్ట్స్ : చెన్నయ్‌లో జరుగుతున్న హాకీ జూనియర్ వరల్డ్ కప్‌లో భారత జట్టు హవా కొనసాగుతోంది. వరుస విజయాలతో జైత్రయాత్ర కొనసాగుతున్న ఈ యువ జట్టు టైటిల్ దిశగా సాగుతోంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్‌లో బలమైన బెల్జియంను ఓడించి సెమీస్‌కు దూసుకెళ్లిం:ది. ఉత్కంఠభరితంగా సాగిన క్వార్టర్స్ షూటౌట్‌కు వెళ్లగా అక్కడ బెల్జియంపై 2(4)-4(3) విజయం సాధించింది. మ్యాచ్ ఆరంభం నుంచి చివరి వరకూ ఆసక్తికరంగా సాగింది. తొలి గోల్ బెల్జియందే. 13వ నిమిషంలోనే గోల్ చేసిన ఆ జట్టు చాలా సేపు 1-0తో ఆధిక్యంలో ఉంది. దీంతో భారత్‌పై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయినా ఏ మాత్రం పట్టుదల కోల్పోలేదు. ప్రత్యర్థిని మరింత లీడ్‌లోకి వెళ్లకుండా నిలువరించింది.

చివరికి 45వ నిమిషంలో భారత్ గోల్ నిరీక్షణకు తెరదించింది. రోహిత్ గోల్ చేసి 1-1తో స్కోరును సమం చేశాడు. కాసేపటికే 48వ నిమిషంలో శార్దానంద్ చేసిన గోల్‌తో భారత్ 2-1తో లీడ్‌లోకి వెళ్లింది. మరో నిమిషంలో మ్యాచ్ ముగుస్తుందనగా భారత్ విజయం ఖాయమే అనుకున్న తరుణంలో బెల్జియం గోల్ చేసి స్కోరును 2-2 స్కోరును సమం చేసింది. నిర్ణీత సమయంలోగా ఫలితం తేలకపోవడంతో మ్యాచ్ పెనాల్టీ షూటౌట్‌‌కు దారితీసింది. అక్కడ భారత్ తరఫున శార్దానంద్ అదరగొట్టాడు. వరుసగా మూడు విజయవంతంగా గోల్స్ చేశాడు. అయితే, బెల్జియం కూడా మూడు గోల్స్ సక్సెస్‌ఫుల్‌గా చేయడంతో అంతా టెన్షన్ నెలకొంది. నాలుగో ప్రయత్నంలో ఇరు జట్లు గోల్ చేయలేదు. ఇక చివరిదైనా ఐదో ప్రయత్నంలో ప్రత్యర్థి గోల్ విఫలమవ్వగా.. భారత్ తరపున అంకిత్ పాల్ బంతిని విజయవంతంగా నెట్స్‌లోకి నెట్టి గెలుపు లాంఛనం చేశాడు. భారత్‌తోపాటు స్పెయిన్, అర్జెంటీనా, జర్మనీ కూడా సెమీస్‌కు చేరుకున్నాయి. ఆదివారం జరిగే సెమీస్‌లో జర్మనీతో భారత్ తలపడనుంది.


Next Story