చైనీస్ తైపీని చిత్తుగా ఓడించిన యువ భారత్.. హ్యాట్రిక్ విజయంతో సెమీస్‌కు చేరువుగా..

by Harish |

పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్‌లో యువ భారత్ జోరు కొనసాగుతోంది.

చైనీస్ తైపీని చిత్తుగా ఓడించిన యువ భారత్.. హ్యాట్రిక్ విజయంతో సెమీస్‌కు చేరువుగా..
X

దిశ, స్పోర్ట్స్ : ఒమన్‌లో జరుగుతున్న పురుషుల హాకీ జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు కొనసాగుతోంది. టోర్నీలో హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మూడో గ్రూపు మ్యాచ్‌లో చైనీస్ తైపీపై 0-16 తేడాతో భారీ విజయం సాధించింది. మ్యాచ్‌లో మొదటి నుంచి చివరి వరకూ భారత్‌దే ఆధిపత్యం. దీంతో చైనీస్ తైపీ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. భారత జట్టులో దిల్ రాజ్ నాలుగు గోల్స్‌తో విజృంభించగా.. సౌర్, రోసన్ చెరో మూడు గోల్స్‌తో సత్తాచాటారు. అర్ష్‌దీప్ రెండు గోల్స్ .. శారదా, అరైజీత్, ప్రియోబార్టా చెరో గోల్ చేశారు. ఈ విజయంతో భారత్ సెమీస్ బెర్త్ దాదాపు ఖాయమైనట్టే. గ్రూపు ఏలో మూడు విజయాలతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఆదివారం ఆఖరి గ్రూపు మ్యాచ్‌లో సౌత్ కొరియాతో యువ భారత్ తలపడనుంది.

Next Story