గిల్ నా తమ్ముడు లాంటివాడు... బాంబు పేల్చిన సారా టెండూల్కర్?

by velandi.Saikiran |

గిల్ నా తమ్ముడు లాంటివాడివని నాకన్నా చిన్నవాడివి నువ్వు.. అంటూ సారా చెప్పే డైలాగ్స్ వైరల్ చేస్తున్నారు

గిల్ నా తమ్ముడు లాంటివాడు... బాంబు పేల్చిన సారా టెండూల్కర్?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టీమిండియా స్టార్ ఆటగాడు, టెస్ట్ కెప్టెన్ గిల్ ( Gill) పరువు తీసింది సచిన్ టెండూల్కర్ ( Sachin) కూతురు సారా టెండూల్కర్ ( Sara Tendulkhar). గిల్ తన తమ్ముడు లాంటివాడని... బాంబు పేల్చింది సారా. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. గిల్ అలాగే సారా టెండుల్కర్ మధ్య రిలేషన్షిప్ ఉందని గత కొన్ని సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. దాదాపు మూడు సంవత్సరాలుగా... వీరిద్దరి మధ్య ఏదో ఉందని నెలకు ఒక వార్త బయటకు వచ్చింది.

అంతేకాదు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని కూడా కొన్ని నేషనల్ మీడియాలో కథనాలు రాసాయి. అలాగే ఆ మధ్యకాలంలో వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని కూడా ప్రచారం చేశారు. ఇలాంటి నేపథ్యంలో సచిన్ కూతురు సారా అలాగే గిల్ రిలేషన్ పై సరికొత్త వీడియో చెక్కర్లు కొడుతోంది.

సారా టెండూల్కర్ కంటే గిల్ చిన్నవాడని.. ఏం మాయ చేసావా సినిమా సీన్ రిపీట్ చేస్తున్నారు కొంతమంది. అందులో ఉన్న సీన్ లో సమంతా అలాగే నాగచైతన్య స్థానంలో సారా, గిల్ ఫోటోలను మార్ఫింగ్ చేసి.. వీడియో వైరల్ చేస్తున్నారు. ఈ సీన్ లో... గిల్ ను ఉద్దేశించి... నువ్వు నా తమ్ముడు లాంటివాడివని సారా పేర్కొంటుంది. నాకన్నా చిన్నవాడివి నువ్వు.. అంటూ సారా చెప్పే డైలాగ్స్ వైరల్ చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సారా టెండుల్కర్ వయసు 27 సంవత్సరాలు కాగా... గిల్ వయసు 26 సంవత్సరాలు మాత్రమే. క్లిక్

Next Story