అండర్ -19 విజేత ఆరోన్ జార్జ్ కు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం

by velandi.Saikiran |

భారతదేశానికి ఐసీసీ అండర్–19 క్రికెట్ వరల్డ్ కప్‌లో సాధించడంలో కీలక పాత్ర పోషించిన మల్లాపూర్ కు చెందిన యువ క్రికెటర్ ఆరోన్ జార్జ్ కు హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది.

అండర్ -19 విజేత ఆరోన్ జార్జ్ కు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
X
  • అండర్ -19 విజేత ఆరోన్ జార్జ్ కు ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
  • వరల్డ్ కప్ విజేతను అభినందించిన ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

దిశ, నాచారం: భారతదేశానికి ఐసీసీ అండర్–19 క్రికెట్ వరల్డ్ కప్‌లో సాధించడంలో కీలక పాత్ర పోషించిన మల్లాపూర్ కు చెందిన యువ క్రికెటర్ ఆరోన్ జార్జ్ కు హైదరాబాద్‌లో శంషాబాద్ విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం లభించింది. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, కుటుంబ సభ్యులు ఆరోన్ జార్జ్ ని కలిసి ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పూలమాలలతో ఘనంగా సత్కరించారు.

ఈ సందర్భంగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి ల‌క్ష్మారెడ్డి మాట్లాడుతూ... విజయాన్ని ప్రశంసిస్తూ ఆరోన్ జార్జ్ ఘన విజయం యువతకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. మల్లాపూర్ ప్రాంతానికి ఉప్పల్ నియోజకవర్గానికి ఆయన తెచ్చిన కీర్తి అపూర్వమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ సందర్భంగా ఆరోన్ జార్జ్ తల్లిదండ్రుల ను చూసి ఆనందభాష్పాలను రాల్చాడు. ఈ కార్యక్రమంలో ఆరోన్ జార్జ్ తల్లిదండ్రులు ఈసో వర్గీస్, ప్రీతి వర్గీస్, మల్లాపూర్ డివిజన్ బి. ఆర్. ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

వరల్డ్ కప్పులో ఆడటం అదృష్టంగా భావిస్తున్నాను

అండర్ - 19 వరల్డ్ కప్ లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అండర్ - 19 విజేత ఆరోన్ జార్జ్ అభిప్రాయపడ్డారు. ఆదివారం మే ఫ్లోర్ హైట్స్ ఆధ్వర్యంలో మల్లాపూర్ లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. జనప్రియ బస్టాప్ నుంచి ఓపెన్ టాప్ జీపు లో ఊరేగింపు నిర్వహించారు. అనంతరం ఫ్లోర్ హైట్స్ లో అధ్యక్షులు రవి కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరోన్ జార్జ్ తో పాటు తల్లిదండ్రులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆరోన్ మాట్లాడుతూ.. క్రికెట్ అంటే తనకు ప్రాణమని చెప్పారు. క్రికెట్ కోచ్, తల్లిదండ్రుల సహకారంతో ఈ స్థాయికి వచ్చానని తెలిపారు. భవిష్యత్తులో మెయిన్ జట్టు లో ఆడడానికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మే ఫ్లవర్ పార్క్ అసోసియేషన్ సెక్రటరీ రాఘవేందర్ రెడ్డి, సంయుక్త కార్యదర్శి ఆంజనేయులు పాల్గొన్నారు.

Next Story