- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Home > స్పోర్ట్స్ > Paris olympics : వినేశ్ ఫొగట్‌కు పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్టార్ రెజ్లర్
Paris olympics : వినేశ్ ఫొగట్‌కు పతకం ఖాయం.. ఫైనల్‌కు దూసుకెళ్లిన స్టార్ రెజ్లర్
by Harish |
పారిస్ ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు పతకం ఖాయమైంది.

X
దిశ, స్పోర్ట్స్ : పారిస్ ఒలింపిక్స్‌లో భారత అగ్రశ్రేణి రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు పతకం ఖాయమైంది. మహిళల 50 కేజీల కేటగిరీలో ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన సెమీస్‌లో వినేశ్ పొగట్ 5-0 తేడాతో క్యూబాకు చెందిన యుస్నీలీస్ గుజ్మాన్‌ను మట్టికరిపించింది. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన ఆమె ఏకపక్షంగా ప్రత్యర్థిని చిత్తు చేసి బౌట్‌ను గెలుచుకుంది. దీంతో ఫైనల్‌కు చేరుకున్న తొలి భారత మహిళా రెజ్లర్‌గా వినేశ్ చరిత్ర సృష్టించింది. అంతేకాకుండా, ఫైనల్‌కు చేరుకుని పతకం ఖాయం చేసుకుంది. ఫైనల్‌లో ఓడినా కనీసం రజతం దక్కనుంది. మంగళవారం ఒక్క రోజే వినేశ్ మూడు బౌట్లలో గెలుపొందడం విశేషం.
Next Story






