- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘బన్నీ హాప్’ క్యాచులపై నిషేధం.. బౌండరీ లైన్ వద్ద క్యాచులకు కొత్త రూల్స్
క్రికెట్లో ‘బన్నీ హాప్’ క్యాచులను నిషేధిస్తున్నట్లు ఎంసీసీ ప్రకటించింది. బౌండరీ లైన్ వద్ద క్యాచులకు కొత్త రూల్స్ తెచ్చింది.

దిశ, స్పోర్ట్స్: క్రికెట్ రూల్స్ తయారు చేసే ఎంసీసీ (మేరీల్‌బోన్ క్రికెట్ క్లబ్) కొత్త రూల్ తీసుకొచ్చింది. బౌండరీల వద్ద అందుకునే క్యాచుల నిబంధనలను కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించింది. బౌండరీ లైన్ వద్ద బంతిని పట్టుకున్న ఫీల్డర్.. అవతలి వైపు దూకిన తర్వాత మళ్లీ మైదానంలోకి వచ్చిన తర్వాతనే బంతిని టచ్ చెయ్యాలని, లేదంటే అది క్యాచ్‌గా పరిగణించడం కుదరదని తేల్చిచెప్పింది. అంతేకానీ, బౌండరీ లైన్ అవతల నేలను మళ్లీ తాకితే దాన్ని బౌండరీగానే పరిగణిస్తామని చెప్పింది. దీన్ని ‘బన్నీ హాప్’గా వర్ణించిన ఎంసీసీ.. ఇకపై బౌండరీ లైన్ అవతలి నుంచి బంతిని మైదానంలోకి విసరడాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది.
అయితే మైదానంలో ఉండగానే బంతిని గాల్లోకి ఎగరేసి, బౌండరీ అవతలకు వెళ్లిన ఫీల్డర్ మళ్లీ గ్రౌండ్‌లోకి వచ్చి క్యాచ్ అందుకుంటే చెల్లుతుందని తెలిపింది. వచ్చే నెల నుంచి ఈ కొత్త రూల్ అమల్లోకి వస్తుందని వెల్లడించింది. దీనంతటికీ బిగ్ బ్యాష్ లీగ్ (బీబీఎల్) 2023లో జరిగిన ఒక ఘటనే కారణం అని తెలుస్తోంది. బ్రిస్బేన్ హీట్‌కు ఆడుతున్న మైఖేల్ నెజెర్ అనే ప్లేయర్.. బౌండరీ వద్ద ఒక క్యాచ్ అందుకున్నాడు. కానీ బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్ దాటేశాడు. ఈ సమయంలో బంతిని గాల్లోకి విసిరాడు. కానీ ఆ బంతి కూడా బౌండరీ అవతలే పడేలా ఉండటంతో తను గాల్లోకి ఎగిరి బంతిని మరోసారి గ్రౌండ్‌లో పడేలా విసిరేశాడు. అది నేలను తాకకముందే తను గ్రౌండ్‌లోకి వచ్చి క్యాచ్ పూర్తిచేశాడు. రూల్స్ ప్రకారం ఇది అవుటే అవడం పెద్ద చర్చకు దారితీసింది.






