మాథ్యూ కునేమాన్‌కు భారీ ఊరట

by Ajay Maddhiboyina |

కునేమాన్ బౌలింగ్ యాక్షన్ ఫలితాలు సానుకూలంగా వచ్చినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటీవ్ జనరల్ మేనేజర్ సంతోషం వ్యక్తం చేశారు.

మాథ్యూ కునేమాన్‌కు భారీ ఊరట
X

- ఆసీస్ బౌలింగ్ యాక్షన్‌కు గ్రీన్ సిగ్నల్

- అనుమతించబడిన కోణంలోనే ఉందన్న ఐసీపీ

దిశ, స్పోర్ట్స్: ఆస్ట్రేలియా స్పిన్నర్ మాథ్యూ కునేమాన్‌కు భారీ ఊరట లభించింది. కునేమాన్ బౌలింగ్ యాక్షన్‌ అనుమానాస్పదంగా లేదని, అనుమతించిన మేరకే మోచేయి వంగుతుందని ఐసీసీ బుధవారం స్పష్టం చేసింది. ఇకపై కునేమాన్ అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ నిరభ్యంతరంగా బౌలింగ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఇటీవల ఆస్ట్రేలియా జట్టు శ్రీలంకలో పర్యటించింది. గాలేలో జరిగిన రెండో టెస్టు సందర్భంగా కునేమాన్ బౌలింగ్ యాక్షన్‌పై మ్యాచ్ అఫీషియల్స్ ఫిర్యాదు చేశారు. దీంతో కునేమాన్ తన అనుమానాస్పద బౌలింగ్ యాక్షన్‌ను సరి చేసుకునే వరకు అంతర్జాతీయ క్రికెట్‌‌లో ఆడటానికి ఐసీపీ తాత్కాలిక నిషేధం విధించింది. కాగా, ఫిబ్రవరి 15న బ్రిస్బేన్‌లోని నేషనల్ క్రికెట్ సెంటర్‌లో కునేమాన్‌ బౌలింగ్ యాక్షన్‌పై టెస్ట్ నిర్వహించారు. ఇందులో ఐసీసీ నిర్దేశించిన 15 డిగ్రీల వంపు పరిధిలోనే కునేమాన్ బౌలింగ్ చేస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. ఈ పరీక్ష ఫలితాలను ఐసీసీ పంపడంతో.. కునేమాన్ ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్ చేయవచ్చంటూ బుధవారం ప్రకటించింది. కాగా, కునేమాన్ బౌలింగ్ యాక్షన్ ఫలితాలు సానుకూలంగా వచ్చినందుకు క్రికెట్ ఆస్ట్రేలియా ఎగ్జిక్యూటీవ్ జనరల్ మేనేజర్ సంతోషం వ్యక్తం చేశారు. కునేమాన్‌కు భవిష్యత్‌లో కూడా తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు.

Next Story