CSKను వదిలేసి, అందులో చేరిపో... ధోని పై హెడెన్ ఫైర్!

by velandi.Saikiran |

చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై ( Dhoni ) మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ మా

CSKను వదిలేసి, అందులో చేరిపో... ధోని పై హెడెన్ ఫైర్!
X

దిశ, వెబ్ డెస్క్ : చెన్నై సూపర్ కింగ్స్ ( Chennai Super Kings ) మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పై ( Dhoni ) మాజీ ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ హేడెన్ ( Mathew Hayden) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఇప్పటికైనా మహేంద్ర సింగ్ ధోని వదిలివేయాలని.. కోరారు. వెంటనే కామెంట్రీ ప్యానెల్ లో చేరిపోవాలని మహేంద్రసింగ్ ధోనీకి చురకలు అంటించారు మాథ్యూ హేడెన్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో... చెన్నై సూపర్ కింగ్స్ జట్టు మొదటి మ్యాచ్ విజయం సాధించగా.. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది.


అయితే ఒక మ్యాచ్ లో 9వ వికెట్ కు మహేంద్ర సింగ్ ధోని రావడంపై విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇక ఆదివారం రోజున రాజస్థాన్ రాయల్స్... చేతిలో చెన్నై ఓడిపోవడానికి మహేంద్రసింగ్ ధోని కూడా కారణమయ్యాడు. చివరలో మ్యాచ్ ఫినిష్ చేయాల్సింది పోగా... సందీప్ శర్మ బౌలింగ్ లో సిక్స్ కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు ధోని. దీంతో చెన్నై ఓడిపోయింది. అదే చివరి ఓవర్ లో మ్యాచ్ గెలిపిస్తే ధోని హీరో అయ్యేవాడు.


అయితే మ్యాచ్ గెలిపించకుండా ధోని ఔట్ కావడంపై చెన్నై అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మాథ్యూ హేడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ మానేసి.. వెంటనే కామెంట్రీ ప్యానెల్ లో మహేంద్రసింగ్ ధోని చేరిపోవాలని వెల్లడించారు మాథ్యూ హేడెన్. ఇంకా ఎన్ని రోజులు క్రికెట్ ఆడతావ్...? ఆ బాధల నుంచి బయటికి వచ్చేసేయ్ అంటూ కామెంట్స్ చేశారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని చురకలు అంటించారు. అయితే మాథ్యూ హేడెన్ (Mathew Hayden ) చేసిన వ్యాఖ్యలపై ధోని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story