- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్కరమ్ జాక్ పాట్ కొట్టేశాడోచ్..
సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ ఎయిడెన్ మార్క్‌రమ్ జాక్‌పాట్ కొట్టేసాడు. కెప్టెన్‌గా వరుస విజయాలు.. సూపర్ ఫామ్‌తో సౌతాఫ్రికా టీ20 కెప్టెన్సీ అందుకున్నాడు.

దిశ, వెబ్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్, సౌతాఫ్రికా స్టార్ ఆల్‌రౌండర్ ఎయిడెన్ మార్క్‌రమ్ జాక్‌పాట్ కొట్టేసాడు. కెప్టెన్‌గా వరుస విజయాలు.. సూపర్ ఫామ్‌తో సౌతాఫ్రికా టీ20 కెప్టెన్సీ అందుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 నూతన కెప్టెన్‌గా మార్క్‌రమ్‌ను నియమిస్తున్నట్లు క్రికెట్ సౌతాఫ్రికా ప్రకటించింది. వైట్ బాల్ బ్యాటింగ్ కోచ్‌గా జేపీ డుమినీ, బౌలింగ్ కోచ్‌గా రోరీ క్లీన్ వెల్ట్‌ను నియమించింది.
సొంతగడ్డపై వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు జట్లను ప్రకటించిన క్రికెట్ సౌతాఫ్రికా టీ20 సారథిగా మార్కరమ్ ను ప్రకటించింది. బవుమాను టీ20 ఫార్మాట్‌కు దూరం పెట్టిన బోర్డు, అతడని టెస్ట్, వన్డేలకు పరిమితం చేసింది. ఫాఫ్ డుప్లెసిస్ పునరాగమనంపై వార్తలు వచ్చినా సెలెక్టర్లు పట్టించుకోలేదని తెలుస్తోంది. సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల హెడ్ కోచ్ రాబ్ వాల్టర్‌తో డుప్లెసిస్ జరిపిన చర్చలు కూడా విఫలమైనట్లు సఫారీ మీడియా పేర్కొంది. ఇక వన్డే సిరీస్‌కు కగిసో రబడా, అన్రిచ్ నోర్జ్‌లకు విశ్రాంతి ఇచ్చిన సెలెక్టర్లు వారి వారి స్థానాల్లో యువ ఆటగాళ్లను ఎంపిక చేశారు.
సూపర్ ఫామ్ లో మార్కరమ్
గత రెండు నెలల్లో మార్కరమ్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అరంగేట్రం సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ జట్టును చాంపియన్‌గా నిలబెట్టిన అతను టోర్నీలో అధ్యంతం అద్భుత ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు. ఈ విజయంతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా ఎంపికైన మార్క్‌రమ్ సుదీర్ఘ కాలం నిరీక్షణ తర్వాత టెస్ట్ క్రికెట్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు.
పునరాగమనంలో ఆడిన తొలి మ్యాచ్‌లోనే సెంచరీతో చెలరేగి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్నాడు. ఈ ప్రదర్శనతో తాజాగా సౌతాఫ్రికా టీ20 సారథ్యం అందుకున్నాడు. కెప్టెన్‌గా సౌతాఫ్రికాకు అండర్ 19 వరల్డ్ కప్ అందించిన అనుభవం మార్క్‌రమ్‌కు ఉండటం అదనపు బలమని చెప్పవచ్చు. కెప్టెన్‌గా అరంగేట్ర సౌతాఫ్రికా టీ20 లీగ్ గెలిచాడు. టీ20 లీగ్‌తో పాటు ఐసీసీ టోర్నీ గెలిచిన ఏకైక కెప్టెన్ కూడా మార్కరమ్ కావడం విశేషం. ఇప్పటి వరకు సౌతాఫ్రికా టీ20 సారథిగా ఉన్న టెంబా బవుమాపై క్రికెట్ సౌతాఫ్రికా వేటు వేసింది.






