- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
స్వదేశీ కోచ్‌లను ప్రోత్సహించాలి
కోచింగ్ అంటే అది కూడా రాకెట్ సైన్సే. అది కూడా కష్టతరమైన పనే అని గోపీచంద్ చెప్పారు.

- వాళ్లేతే మన అథ్లెట్లను బాగా అర్థం చేసుకుంటారు
- అభిప్రాయపడిన మనూ భాకర్
- సమర్థించిన పుల్లెల గోపీ చంద్
దిశ, స్పోర్ట్స్: భారత క్రీడా రంగం స్వదేశీ కోచ్‌లను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఒలింపియన్ మను భాకర్ అభిప్రాయపడ్డారు. తమ కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రీడాకారులు ఎవరూ యాక్టీవ్‌గా ఉండటం లేదు. వారికి మనం అవకాశాలు ఇవ్వకపోవడం వల్లే మరుగున పడిపోతున్నారని మను భాకర్ అన్నారు. ట్రయల్ బ్లేజర్స్ 3.0 కాంక్లేవ్‌లో గురువారం పాల్గొన్న మనూ భాకర్ స్వదేశీ కోచ్‌ల అవసరంపై మాట్లాడారు. మాజీ క్రీడాకారులు భారత అథ్లెట్లను చక్కగా అర్థం చేసుకోగలుగుతారు. అంతే కాకుండా వారితో త్వరగా కలిపిపోతారు. విదేశీ కోచ్‌ల అవసరం లేదని నేను అనడం లేదు. కానీ మనం భారత కోచ్‌లకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని మను భాకర్ తెలిపారు. మనూ భాకర్ అభిప్రాయాన్ని పుల్లెల గోపీచంద్ సమర్థించారు. మనకు సరిపడా కోచ్‌లు లేరు. భారత మాజీ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు ఇవ్వడంపై దృష్టి పెట్టాలని అన్నారు. కోచింగ్ అంటే రాకెట్ సైన్స్ కాదని చాలా మంది అభిప్రాయపడతారు. కానీ అది తప్పు.. కోచింగ్ అంటే అది కూడా రాకెట్ సైన్సే. అది కూడా కష్టతరమైన పనే అని గోపీచంద్ చెప్పారు.
ఒక ఒలింపిక్స్‌లో రెండు పథకాలు సాధించిన భారత అథ్లెట్‌గా మను భాకర్ రికార్డు సృష్టించింది. ఆమెకు కోచ్‌గా మాజీ షూటర్ జస్పాల్ రాణా వ్యవహరిస్తున్నారు. పారీస్ ఒలింపిక్స్‌లో కూడా మను భాకర్‌కు జస్పాల్ రాణా కోచింగ్ ఇచ్చారు. ఆయన లేకపోతే నేను ఇవ్వాళ ఈ విజయాలు సాధించేదాన్ని కాదని మను భాకర్ గతంలో వ్యాఖ్యానించారు. భారత క్రీడాకారులు కోరుకునేవి చాలా చిన్న విషయాలు. ప్రతీ అథ్లెట్‌కు ఉద్యోగ భద్రత కల్పించాలి. అలాగే జూనియర్ లెవెల్లో సరైన కార్యక్రమాలు నిర్వహించాలి. ఇవి నెరవేర్చగలిగితే భారత క్రీడా లోకం మరిన్ని విజయాలు సాధిస్తుందని మను భాకర్ అభిప్రాయపడ్డారు. 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ కోసం జనవరి నుంచే సన్నాహక కార్యక్రమాలు మొదలయ్యాయని చెప్పారు. ఇప్పటికే కొత్త పిస్టల్స్ ఆర్డర్ చేశాను. గ్రిప్స్ కూడా సిద్ధం చేసుకున్నానని చెప్పారు. జూన్ లేదా జూలై నుంచి ప్రాక్టీస్ మొదలు పెడతానని మను భాకర్ చెప్పారు.






