మాంచెస్టర్ టెస్ట్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్

by Kema Shiva Kumar |

ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ (England), భారత్‌ (India) మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది.

మాంచెస్టర్ టెస్ట్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్
X

దిశ, వెబ్‌డె‌స్క్: ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌ (England), భారత్‌ (India) మధ్య మాంచెస్టర్ వేదికగా నాలుగో టెస్టు మ్యాచ్‌ అట్టహాసంగా ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన ఆతిథ్య జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. ఓవర్‌కాస్ట్ కండిషన్స్ నేపథ్యంలోనే తాను బౌలింగ్‌ వైపు మొగ్గు చూపినట్లుగా స్టెక్స్ పేర్కొన్నాడు. ఇక టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. టాస్ గెలిస్తే బౌలింగ్, బ్యాటింగ్ ఎంచుకునే విషయంలో తాను కాస్త గందరగోళానికి గురయ్యానని తెలిపాడు. లాస్ట్ మూడు మ్యాచ్‌ల్లో మేం మెరుగైన ప్రదర్శన చేశామని. చివరి మ్యాచ్ కొద్దిలో చేజారిందని కామెంట్ చేశాడు. మూడు టెస్ట్‌లు హోరాహోరీగా జరగాయని.. ఇక ఓల్డ్ ట్రాఫోర్డ్ (Old Trafford) పిచ్ కూడా చాలాబాగా కనిపిస్తోందని అన్నారు. జట్టులో మొత్తం మూడు మార్పులు చేశామని కెప్టెన్ గిల్ వెల్లడించారు. కరుణ్ నాయర్ స్థానంలో తుది జట్టులోకి సాయి సుదర్శన్‌, గాయపడిన ఆకాష్ దీప్, నితీష్ రెడ్డి స్థానాల్లో అన్షూల్ కంబోజ్, శార్డూల్ ఠాకూర్ బరిలోకి దిగుతున్నారన కెప్టెన్ గిల్ తెలిపాడు.

తుది జట్టు ఇవే..

భారత జట్టు: యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, సాయి సుదర్శన్‌, శుభ్‌మన్‌ గిల్‌ (C), రిషభ్ పంత్‌ (WK), రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, మహ్మద్‌ సిరాజ్‌, అన్షుల్‌ కాంబోజ్‌

ఇంగ్లాండ్‌ జట్టు: జాక్‌ క్రాలీ, బెన్‌ డకెట్‌, ఓలీపాప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌ (C), జెమీ స్మిత్‌ (WK), లియామ్‌ డాసన్‌, క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్స్‌, జోఫ్రా ఆర్చర్‌

Next Story