- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, వెబ్ డెస్క్ : పెట్రోనాస్ మలేషియా ఓపెన్ - 2026 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నేటి నుంచి మలేషియాలో ప్రారంభం కానుంది. ఇది 2026 BWF వరల్డ్ టూర్‌లో తొలి టోర్నమెంట్. జనవరి 6 నుంచి 11 వరకు కౌలాలంపూర్‌లోని ఆక్సియాటా అరేనాలో ఈ టోర్నమెంట్ జరగనుంది. మొత్తం ఆరు రోజుల పాటు మెన్స్ సింగిల్స్, విమెన్స్ సింగిల్స్, మెన్స్ డబుల్స్, విమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో మ్యాచ్‌లు ఉంటాయి. ఈ టోర్నమెంట్‌కు మొత్తం ప్రైజ్ మనీ 14.5 లక్షల అమెరికన్ డాలర్లు (సుమారు రూ.12 కోట్లు).
కాగా భారత నుంచి స్టార్ ఆటగాళ్లు బరిలో దిగుతున్నారు. ఇటీవల మడమ గాయం తర్వాత భారత స్టార్ బ్యాడ్మింటన్ పీవీ సింధు మళ్లీ బరిలోకి దిగుతుండగా, మెన్స్ డబుల్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ 3వ సీడ్‌గా బరిలో ఉంది. అలాగే లక్ష్య సేన్, ట్రీసా జాలీ–గాయత్రీ గోపీచంద్, తనిషా క్రాస్టో–ధ్రువ్ కపిల వంటి భారత ఆటగాళ్లు కూడా ఈ టోర్నమెంట్‌లో పోటీ పడుతున్నారు. జనవరి 11న ఫైనల్స్‌తో ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్ ముగియనుంది.






