- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : మలేసియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ క్రీడాకారిణి పీవీ సింధు టైటిల్ ఆశలు గల్లంతయ్యాయి. సంచలన ప్రదర్శన చేసిన ఆమె సెమీస్‌లో ఓడిపోయి ఇంటిదారిపట్టింది. శనివారం జరిగిన ఉమెన్స్ సింగిల్స్ సెమీస్‌లో సింధు 16-21, 15-21 తేడాతో చైనా క్రీడాకారిణి, వరల్డ్ నం.2 వాంగ్ జి యి చేతిలో పరాజయం పాలైంది. తొలి గేములో ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు పోటీపడ్డారు. దీంతో 14-14తో సమంగా నిలిచారు. ఆ స్థితిలో సింధు అనవసర తప్పిదాలు చేసి గేమును ప్రత్యర్థికి సమర్పించుకుంది. ఇక, రెండో గేమును అయితే చేజేతులా కోల్పోయింది. ఆరంభం నుంచి లీడ్‌లోనే కొనసాగిన ఆమె 13-9 తర్వాత పట్టు కోల్పోయింది. వరుసగా పాయింట్స్ కోల్పోయి ఓటమిపాలైంది. సింధు నిష్ర్కమణతో ఈ టోర్నీలో భారత్ పోరాటం కూడా ముగిసింది. సాత్విక్-చిరాగ్, గాయత్రి-ట్రీసా జంటలతోపాటు లక్ష్యసేన్ ఇప్పటికే ఇంటిదారిపట్టిన విషయం తెలిసిందే.






