- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
శ్రీలంక క్రికెటర్ తో 51 ఏళ్ళ హీరోయిన్ అరాచకం ?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో... ఓ కొత్త జంట మధ్య

దిశ, వెబ్ డెస్క్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ( Indian Premier League 2025 Tournament ) నేపథ్యంలో... ఓ కొత్త జంట మధ్య ప్రేమాయణం నడుస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 51 ఏళ్ల బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా ( Malaika Arora ), శ్రీలంక మాజీ క్రికెటర్, ప్రస్తుత రాజస్థాన్ రాయల్స్ జట్టు డైరెక్టర్ కుమార సంగక్కర ( Kumar Sangakkara) ఇద్దరు ప్రేమలో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా సూపర్ సండే రోజు చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Chennai Super Kings vs Rajasthan Royals) జట్ల మధ్య గౌహతి వేదికగా మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు పై రాజస్థాన్ రాయల్స్ ఆర్ వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా... కుమార సంగక్కర తో కలిసి మలైకా అరోరా.. మ్యాచ్ తిలకించారు.
ఇద్దరు కూడా రాజస్థాన్ రాయల్స్ జెర్సీ ధరించి పక్కపక్కనే కూర్చున్నారు. రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లు అద్భుతంగా ఆడుతున్న నేపథ్యంలో.. ఒకరిని ఒకరు చూసుకుంటూ సందడి చేశారు. లవర్స్ ఎలా మ్యాచ్ ఎంజాయ్ చేస్తారో...? అచ్చం అలాగే స్టేడియంలో రచ్చ రచ్చ చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో..కుమార సంగక్కర ( Kumar Sangakkara) అలాగే మలైక అరోరా ( Malaika Arora ) ఇద్దరు... డేటింగ్ లో ఉన్నట్లు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.






