- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డబ్ల్యూడబ్ల్యూఈలో తీవ్ర దుమారం.. మహిళా రెజ్లర్ల వ్యక్తిగత ఫొటోలు లీక్
సెలబ్రిటీ హోదా వల్ల మహిళా రెజ్లర్లు సైబర్ వేధింపులు, ప్రైవసీ సమస్యలతో అల్లాడుతున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: వరల్డ్ వైడ్‌గా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) మహిళా రెజ్లర్లకు సెలబ్రిటీ హోదా శాపంగా మారుతోంది. సైబర్ నేరగాళ్లు వారు క్లౌడ్ అకౌంట్లను, మొబైల్ ఫోన్లను హ్యాక్ చేసి, వారి నుంచి ఎలాంటి పర్మీషన్ లేకుండానే అత్యంత వ్యక్తిగత ఫోటోలను ఆన్‌లైన్‌లో లీక్ చేసిన ఘటన డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. డబ్ల్యూడబ్ల్యూఈ చరిత్రలోనే అతి పిన్న వయసులో దివాస్ ఛాంపియన్‌గా జేడ్ బెవిస్ (పేజ్)పై తీవ్రమైన సైబర్ దాడికి గురైంది. అయితే తోటి రెజ్లర్ల మద్దతుతో ఆమె ఆ కఠినమైన దశను దాటి తన కెరీర్‌ను సఫలంగా కొనసాగిస్తోంది. ఇక 14 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచిన షార్లెట్ ఫ్లెయిర్ (Charlotte Flair) సైతం మోసానికి గురైంది. తన అనుమతి లేకుండా ఫోటోలను దొంగిలించారని వాటిని వెంటనే తొలగించాలంటూ ఆమె సైబర్ వేధింపులపై గళమెత్తింది.
ఇక టోని స్టార్మ్ (Toni Storm).. ఆమె ఫోటోలు లీక్ అయిన నేపథ్యంలో ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్లను డిలీట్ చేసుకుంది. దీంతో అభిమానులు, తోటి స్టార్లు #WeSupportToniStorm హ్యాష్‌ట్యాగ్‌తో ఆమెకు పెద్ద ఎత్తున అండగా నిలిచారు. మాజీ ఛాంపియన్ అయిన కైట్లిన్ (Kaitlyn) ఫోటోలు లీక్ అయిన క్రమంలో ఓ అభిమాని లైవ్ షోలో ఆ ఫోటో పోస్టర్‌ను పట్టుకుని రావడం తనను కలచివేసిందని, ఈ మానసిక ఒత్తిడి వల్లే తాను తిరిగి రెస్లింగ్ రింగ్‌లోకి రాకూడదని నిర్ణయించుకున్నట్లుగా తెలిపింది. అదేవిధంగా మరియా కనెల్లిస్ ఫోటోల లీక్ వ్యవహారంపై ధైర్యంగా స్పందించింది. అవి తన భర్తతో పంచుకున్న వ్యక్తిగత ఫోటోలని.. ఓ బంధంలో అవి సాధారణమేనని చెప్పింది. అయితే ఇతరుల ప్రైవసీని దొంగిలించే హ్యాకర్లకు మానసిక చికిత్స అవసరమని మరియా కనెల్లిస్ కామెంట్ చేసింది.






