బెడిసికొట్టిన‌ టీమిండియా ప్లాన్..రెచ్చిపోతున్న విండీస్..కాంప్‌బెల్ సెంచ‌రీ

by velandi.Saikiran |

రెండో టెస్ట్ లో టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా ఆట కనబరిచి, వె

బెడిసికొట్టిన‌ టీమిండియా ప్లాన్..రెచ్చిపోతున్న విండీస్..కాంప్‌బెల్ సెంచ‌రీ
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ లో టీమిండియా వర్సెస్ వెస్టిండీస్ తలపడుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా అద్భుతంగా ఆట కనబరిచి, వెస్టిండీస్ ను ఫాలోఆన్ ఆడిస్తోంది. అయితే మొదటి ఇన్నింగ్స్ లో చేతులు ఎత్తేసిన వెస్టిండీస్ బ్యాటర్లు, ఫాలోఆన్ మాత్రం బాగా ఆడుతున్నారు. నిన్ననే వెస్టిండీస్ ప్లేయర్లను ఆలౌట్ చేసి మ్యాచ్ గెలిచేద్దామని టీం ఇండియా ప్లాన్ వేసింది. కానీ ఆ ప్లాన్ బెడిసి కొట్టింది. వెస్టిండీస్ బ్యాటర్లు పుంజుకొని అదిరిపోయే బ్యాటింగ్ ప్రదర్శన కనబరుస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే ఓపెనర్ జాన్ క్యాంప్ బెల్ ( John Campbell ) సెంచరీ తో రెచ్చిపోయాడు. టెస్టుల్లో తన మొదటి సెంచరీ కూడా మన ఇండియా పైనే చేసేసుకున్నాడు. అటు షై హోప్ 80 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్నాడు. అతను కూడా సెంచరీ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి మూడు వికెట్లు నష్టపోయిన వెస్టిండీస్ 218 పరుగులు చేసింది. మరో 52 పరుగులు చేస్తే ఫాలోఆన్ నుంచి బయటపడుతుంది. ఇదే ఆట తీరును వెస్టిండీస్ ప్లేయర్లు కొనసాగించి, రేపటి దాకా ఆడితే, మ్యాచ్ డ్రా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఆ దిశగా వెస్టిండీస్ బ్యాటర్లు ముందుకు వెళుతున్నట్లు తెలుస్తోంది.

Next Story