7 వికెట్లు ప‌డ‌గొట్టిన మొనగాడు..కుప్ప‌కూలిన పాకిస్తాన్‌

by velandi.Saikiran |

దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు కేశ‌వ్ మ‌హ‌రాజ్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఏడు వికెట్లు తీసి పాకిస్తాన్ నడ్డి

7 వికెట్లు ప‌డ‌గొట్టిన మొనగాడు..కుప్ప‌కూలిన పాకిస్తాన్‌
X

దిశ‌, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య రావాల్‌పిండి వేదికగా రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు కేశ‌వ్ మ‌హ‌రాజ్ ( Keshav Maharaj) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఈ నేపథ్యంలోనే ఏడు వికెట్లు తీసి పాకిస్తాన్ నడ్డి విరిచాడు. దీంతో పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్ లో ఆలౌట్ అయింది. నిన్న అద్భుతంగా ఆడిన పాకిస్తాన్, ఇవాళ కేశ‌వ్ మ‌హ‌రాజ్ దెబ్బ‌కు 333 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

పాకిస్తాన్ కెప్టెన్ మసూద్ 87 పరుగులు చేయగా షకీల్ 66 పరుగులు చేసి రాణించారు. అటు టీ20 కెప్టెన్ సల్మాన్ అఘా 45 పరుగులతో దుమ్ము లేపాడు. అయితే కేశ‌వ్ మ‌హ‌రాజ్ బౌలింగ్ లో ఆడేందుకు చాలా కష్టపడ్డ పాకిస్తాన్... 7 వికెట్లు సమర్పించుకుంది. ఈ మ్యాచ్ లో 42 ఓవర్లు వేసిన కేశ‌వ్ మ‌హ‌రాజ్ 102 పరుగులు ఇచ్చి ఏడు వికెట్లు పడగొట్టాడు. ఇక మొదటి ఇన్నింగ్స్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా ఇప్పటికే రెండు వికెట్లు కోల్పోయింది. 65 పరుగులు చేసిన దక్షిణాఫ్రికా పోరాడుతోంది.

Next Story