- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మహరాజ్ మాయ.. ఇంగ్లండ్ విలవిల.. తొలి వన్డేలో ఘోరఓటమి
మహరాజ్ స్పిన్ మాయకు ఇంగ్లండ్ టీం విలవిల్లాడింది. తొలి వన్డేలో ఘోరంగా ఓడిపోయింది.

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీసును సౌతాఫ్రికా ఘనవిజయంతో మొదలుపెట్టింది. టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా కెప్టెన్ టెంబా బవుమా నమ్మకాన్ని స్పిన్నర్ కేశవ్ మహరాజ్ (4/22) నిలబెట్టాడు. అతనికి వియాన్ ముల్డర్ (3/33) జతకలవడంతో ఇంగ్లండ్ ఏ దశలోనూ మంచి స్కోరు చేసేలా కనిపించలేదు. ఓపెనర్ జేమీ స్మిత్ (54) అర్ధశతకంతో రాణించినా మిగతా ప్లేయర్లలో ఒక్కళ్లు కూడా 15-పరుగుల స్కోరు దాటలేకపోయారు. దీంతో ఇంగ్లండ్ జట్టు 24.3 ఓవర్లలో కేవలం 131 పరుగులకు ఆలౌట్ అయింది.
స్వల్ప లక్ష్య ఛేదనలో సఫారీలకు ఎయిడెన్ మార్క్రమ్ (86), ర్యాన్ రికెల్టన్ (31 నాటౌట్) అదిరిపోయే ఆరంభం అందించారు. చివర్లో మార్క్రమ్, బవుమా (6), ట్రిస్టన్ స్టబ్స్ (0) స్వల్ప వ్యవధిలోనే అవుటైనా.. డెవాల్డ్ బ్రెవిస్ (6 నాటౌట్)తో కలిసి రికెల్టన్ లాంఛనం పూర్తిచేశాడు. సౌతాఫ్రికా కేవలం 20.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి, సిరీసులో 1-0 ఆధిక్యం సాధించింది. అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన మహరాజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ రెండు టీమ్స్ మధ్య రెండో వన్డే గురువారం నాడు లార్డ్స్ వేదికగా జరగనుంది.






