Kranti Goud: లేడీ బుమ్రాకు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌

by velandi.Saikiran |

. వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన త‌రుణంలో క్రాంతి గౌడ్ కు కోటి రూపాయ‌లు ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది మ‌ధ్య ప్ర‌దేశ్ స‌ర్కార్

Kranti Goud: లేడీ బుమ్రాకు భారీ న‌జ‌రానా ప్ర‌క‌టించిన మ‌ధ్య‌ప్ర‌దేశ్‌
X

దిశ‌, వెబ్ డెస్క్‌: టీమిండియా మ‌హిళ‌ల జ‌ట్టులో లేడీ బుమ్రాగా పేరుగాంచిన క్రాంతి గౌడ్ కు బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలింది. వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన త‌రుణంలో క్రాంతి గౌడ్ కు కోటి రూపాయ‌లు ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది మ‌ధ్య ప్ర‌దేశ్ స‌ర్కార్. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది. లేడీ బుమ్రాగా పాపుల‌రైన‌ క్రాంతి గౌడ్ ది (Kranti Goud) మ‌ధ్య ప్ర‌దేశ్ అన్న సంగ‌తి తెలిసిందే. అందుకే ఈ న‌జ‌రానా ఇచ్చేందుకు ముందుకు వ‌చ్చింది మ‌ధ్య ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం.

ఇది ఇలా ఉండ‌గా, మ‌హిళ‌ల వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ విజేత‌గా టీమిండియా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఈ టోర్న‌మెంట్ లో భాగంగా నిన్న ఫైన‌ల్స్ టీమిండియా వ‌ర్సెస్ ద‌క్షిణాఫ్రికా మ‌ధ్య జ‌రిగింది. ఇందులో 52 ప‌రుగుల తేడాతో ఇండియా విజ‌యం సాధించింది. దీంతో తొలిసారిగా ఛాంపియ‌న్ గా నిలిచింది టీమిండియా. వ‌ర‌ల్డ్ క‌ప్ గెలిచిన త‌రుణంలో రూ.39.78 కోట్లు ఐసీసీ నుంచి రానున్నాయ‌ట‌. అలాగే బీసీసీఐ కూడా రూ.51 కోట్లు ఇచ్చేందుకు నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు అధికారిక ప్ర‌క‌ట‌న చేసింది.

Next Story