- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఐపీఎల్‌లో ఉహించని ప్రమాదం.. నేరుగా మైదానంలోకి అంబులెన్స్
ఐపీఎల్ 2026: క్యాచ్ పట్టబోయి ఢిల్లీ బౌలర్ లుంగి ఎంగిడికి తీవ్ర గాయం. మైదానంలోకి ఆంబులెన్స్.. హుటాహుటిన ఆసుపత్రికి తరలింపు.

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్ 2026 లో భాగంగా ఢిల్లీ వేదికగా జరుగుతున్న 35వ మ్యాచులో ఊహించని ప్రమాదం చోటు చేసుకుంది. రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో ఢిల్లీ బౌలర్ లుంగి ఎంగిడి ఓ క్యాచ్ ను పట్టబోయి వెనక్కి పడిపోయాడు. దీంతో అతని మెడ వెనుక భాగంలో గాయం కావడంతో మైదానంలోనే కుప్పకూలిపోయాడు. అతన్ని పరిశీలించిన ఆరోగ్య నిపుణులు వెంటనే గ్రౌండ్ లోకి అంబులెన్స్ పిలిపించారు. అనంతరం అతన్ని వేగంగా ఆస్పత్రికి తరలించారు. దీంతో పంజాబ్ కింగ్స్ మ్యాచ్ 20 నిమిషాల పాటు నిలిచిపోయింది. ఎంగిడి గాయం కారణంగా కింద పడిపోయిన తర్వాత ఒక్కసారిగా గ్రౌండ్ మొత్తం సైలెంట్ అయిపోయింది. అక్కడ ఏం జరుగుతుందో తెలియక ఉత్కంఠగా ఎదురు చూశారు. కాగా ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ అభిమానులతో పాటు ఐపీఎల్ అభిమానులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉంటే మరికొద్ది సేపట్లో ఎంగిడి పరిస్థితిపై ఐపీఎల్, ఢిల్లీ యాజమాన్యం అధికారిక ప్రకటన చేయనున్నారు.






