- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లక్నో చేతులో చిత్తుగా ఓడిన గుజరాత్
ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... గుజరాత్ జట్టుకు ( Gujarat Titans) ఘోర ఓటమి ఎదురైంది. ఎలిమినేట్ అయిన లక

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025 టోర్నమెంట్ ( IPL 2025) నేపథ్యంలో... గుజరాత్ జట్టుకు ( Gujarat Titans) ఘోర ఓటమి ఎదురైంది. ఎలిమినేట్ అయిన లక్నో చేతిలో.. గుజరాత్ ఓడిపోయింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium, Ahmedabad ) వేదికగా గురువారం రోజున గుజరాత్ వర్సెస్ లక్నో మధ్య ఫైట్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన లక్నో.. ఏకంగా 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ మ్యాచ్ లో మొదట లక్నో బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 235 పరుగులు చేసింది లక్నో. అటు లక్నో ఆటగాడు మిచెల్ మార్ష్ 64 బంతుల్లోనే 117 పరుగులు చేసి దుమ్ము లేపాడు. అటు పురాన్ కూడా 27 బంతుల్లోనే 56 పరుగులు చేసి రఫ్పాడించాడు.
ఇవాల్టి మ్యాచ్ లో రిషబ్ పంత్ ఆరు బంతుల్లోనే 16 పరుగులు చేశాడు. ఇక అనంతరం 236 పరుగుల చేజింగ్ కు దిగిన గుజరాత్... మొదటి నుంచి ఎదురుదెబ్బలు ఫేస్ చేసుకుంటూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే నిర్ణీత 20 ఓవర్లు ఆడిన గుజరాత్ టైటాన్స్ 9 వికెట్లు నష్టపోయి 202 పరుగులు చేసింది. దీంతో లక్నో చేతిలో ఓడిపోవలసి వచ్చింది. అయితే ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ పాయింట్ల పట్టికలో... మొదటి స్థానంలోనే గుజరాత్ టైటాన్స్ ఉంది.






