- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ( Lucknow Supergiants vs Punjab Kings ) మధ్య మ్యాచ్ జరగనుంది. ఇప్పటి వరకు ఈ టోర్నమెంటులో 12 మ్యాచ్ లు పూర్తి కాగా ఇవాళ 13 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్ హోమ్ గ్రౌండ్ లో జరగనుంది. లక్నోలోని అటల్ బీహార్ వాజ్ పేయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ( Atal Bihari Vajapee Stadium)... వర్సెస్ పంజాబ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. ఇవాళ రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ గత రికార్డులు
లక్నో సూపర్ జెయింట్స్ వర్సెస్ పంజాబ్ ( Lucknow Supergiants vs Punjab Kings ) మధ్య ఇప్పటివరకు కేవలం నాలుగు అంటే నాలుగు మ్యాచ్ లు జరిగాయి. ఇందులో.. లక్నో పై చేయి సాధించింది. పంజాబ్ కింగ్స్ పైన ఏకంగా మూడు మ్యాచ్ ల్లో విజయం సాధించింది లక్నో. అటు కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో పంజాబ్ విజయం సాధించింది. అయితే గతంలో ఈ మ్యాచ్ లు జరిగాయి. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ చాలా బలంగా తయారైంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో దూసుకుపోతోంది. కాబట్టి ఇవాల్టి మ్యాచ్ లో ఏ జట్టు గెలుస్తుందో అనేది చెప్పడం చాలా కష్టమే. కానీ లక్నోకు హోమ్ గ్రౌండ్ కావడంతో... వాళ్లకు ఎక్కువగా ఎడ్జ్ ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.






