- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
IPL 2025 : LSG vs PBKS ఐపీఎల్ మ్యాచ్... టాస్ గెలిచిన పంజాబ్
ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్(LSG vs PBKS) మధ్య మ్యాచ్ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025) సీజన్లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్(LSG vs PBKS) మధ్య మ్యాచ్ జరగనుంది. లక్నోలోని ఏకనా స్టేడియం వేదిక(Ekana Stadium)గా మరికొద్ది సేపట్లో మొదలవనున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(Shreyas Aiyar) బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో లక్నో తొలుత బ్యాటింగ్ కు దిగనుంది. ఈ సీజన్లో ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడి ఒక మ్యాచ్ గెలవగా.. పంజాబ్ ఇప్పటివరకు ఆడిన ఒక మ్యాచ్ లో విజయం సాధించింది.
ఇరు జట్ల వివరాలివే :
లక్నో సూపర్ జెయింట్స్ (LSG): ఐడెన్ మార్క్‌రమ్, మిచెల్ మార్ష్, రిషభ్ పంత్ (కెప్టెన్ & వికెట్ కీపర్), నికోలస్ పూరన్, ఆయుష్ బడోనీ, డేవిడ్ మిల్లర్, షాబాజ్ అహ్మద్, షర్దూల్ ఠాకూర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ప్రిన్స్ యాదవ్.
పంజాబ్ కింగ్స్ (PBKS): ప్రభ్‌సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), ప్రియాంక్ ఆర్య, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాంశ్ షెడ్గే, అజ్మతుల్లా ఒమర్‌జాయ్, మార్కో జాన్సెన్, ఆర్ష్‌దీప్ సింగ్, యుజవేంద్ర చాహల్.






