IPL 2025 : LSG vs MI ఐపీఎల్ మ్యాచ్... ముంబై టార్గెట్ 204

by Muthe.Rajitha |

ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్(LSG vs MI) మధ్య మ్యాచ్ జరుగుతోంది.

IPL 2025 : LSG vs MI ఐపీఎల్ మ్యాచ్... ముంబై టార్గెట్ 204
X

దిశ, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2025(IPL 2025)లో భాగంగా నేడు లక్నో సూపర్ జెయింట్స్, ముంబై ఇండియన్స్(LSG vs MI) మధ్య మ్యాచ్ జరుగుతోంది. లక్నోలోని ఏకనా స్టేడియం(Ekana Stadium) వేదికగా జరగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో పరుగుల వరద పారించింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్స్ లో మార్ష్(Marsh) 31 బంతుల్లో 60 పరుగులు చేసి జట్టును స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. మార్క్రం 53, బదోని 30 పరుగులతో రాణించారు. ఇక ముంబై బౌలర్స్ లో పాండ్యా(Pandya) చెలరేగిపోయాడు. ఏకంగా 5 వికెట్లు తీసి, లక్నో భారీ స్కోరుకు అడ్డుకట్ట వేశాడు. బౌల్ట్, అశ్విన్, పుతుర్ తలా ఒక వికెట్ తీశారు. తదుపరి ఇన్నింగ్స్ లో 204 పరుగుల భారీ లక్ష్యంలో ముంబై బరిలోకి దిగనుంది.

Next Story