- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘లార్డ్స్’ పిచ్ ఫర్ సేల్.. ఒక్క పీస్‌కు ఎంతో తెలుసా?
లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

దిశ, స్పోర్ట్స్ : లండన్‌లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియానికి ఉన్న ప్రత్యేకత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అత్యంత పురాతనమైన ఆ స్టేడియంలో ఒక్క సారైనా ఆడాలనేది ప్రతి క్రికెటర్ ఆశ. అంతటి ప్రతిష్టాత్మక స్టేడియమైన లార్డ్స్ మైదానానికి సంబంధించి ఆ స్టేడియాన్ని నిర్వహిస్తున్న మెరిల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసీసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పిచ్‌తోపాటు మైదానం టర్ఫ్‌ను అమ్మకానికి పెట్టింది. స్టేడియాన్ని కొత్తగా తీర్చిదిద్దేందుకు ఎంసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంసీసీ ఫౌండేషన్ కోసం ఫండ్స్ సేకరణకు, స్టేడియం భవిష్యత్తు అభివృద్ధికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎంసీసీ తెలిపింది. 1.2x0.6 మీటర్ల సైజ్‌లో ఉండే టర్ఫ్‌ను 50 యూరోలు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 5 వేలకు సేల్ చేయనున్నారు.
ఎంసీసీకి 25 వేల మంది సభ్యులు ఉన్నారు. సభ్యులతోపాటు సాధారణ క్రికెట్ అభిమానులకు కూడా పిచ్, టర్ఫ్‌ను కొనుగోలు చేయడానికి అవకాశం ఇచ్చింది. అమ్మకాల ద్వారా వచ్చిన ఫండ్స్‌లో 10 శాతం ఎంసీసీ ఫౌండేషన్‌కు వెళ్తాయి. మిగతా నిధులు స్టేడియంలో మౌళిక సదుపాయాలు మెరుగుపర్చడానికి ఉపయోగించనున్నారు. స్టెప్టెంబర్ 29 లేదా 30 తేదీలో టర్ఫ్‌ను తీసుకెళ్లొచ్చని ఎంసీసీ తెలిపింది. స్టేడియం టర్ఫ్‌ను తొలగించడం ఇదే తొలిసారి కాదు. 2002లో డ్రైనేజీ సౌకర్యాన్ని మెరుగుపర్చడానికి టర్ఫ్‌ను తీసేశారు. అప్పుడు కూడా గ్రాస్‌ను వేలం వేయగా.. 35 వేల ఫౌండ్లు వచ్చాయి. మళ్లీ 23 ఏళ్ల తర్వాత మైదానాన్ని కొత్తగా తీర్చిదిద్దేందుకు గడ్డిని తొలగించే కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. 15 ఎం.ఎంతో ఉన్న టర్ఫ్‌ను తీసేసి మళ్లీ కొత్త ఉపరితలాన్ని సిద్ధం చేయనున్నారు. సెప్టెంబర్‌లో ఈ కార్యక్రమం మొదలుపెట్టనున్నట్టు తెలుస్తోంది.






