లార్డ్స్ టెస్టు పిచ్‌పై విమర్శలు..ఐసీసీ వేటు!

by velandi.Saikiran |   (  Updated:2026-06-10 01:13:46  IST  )

200 సంవత్సరాల చరిత్ర గల లార్డ్స్ స్టేడియానికి తొలిసారిగా డీమెరిట్ పాయింట్ విధించింది ఐసీసీ.

లార్డ్స్ టెస్టు పిచ్‌పై విమర్శలు..ఐసీసీ వేటు!
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇంగ్లాండ్ లోని లార్డ్స్ క్రికెట్ స్టేడియం ఖాతాలో చెత్త రికార్డు నమోదు అయింది. 200 సంవత్సరాల చరిత్ర గల లార్డ్స్ స్టేడియానికి తొలిసారిగా డీమెరిట్ పాయింట్ విధించింది ఐసీసీ. గత వారం జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ లో గ్రౌండ్ క్వాలిటీ సంతృప్తికరంగా లేదని ఐసీసీ సీరియస్ అయింది. రెండు రోజులు అయినప్పటికీ బౌన్స్ తగ్గలేదని నిపుణులు కూడా వెల్లడించారు. ఈ గ్రౌండ్ ప‌రిస్థితుల‌పై ఐసీసీకి ఫిర్యాదులు కూడా చేశారు. ఈ త‌రుణంలోనే ఐసీసీ యాక్ష‌న్ తీసుకుంది. కాగా ఆరు డీమెరిట్ పాయింట్లు ఉంటే.. ఆ గ్రౌండ్ పై ఏడాది నిషేధం పడుతుందన్నమాట. ఇది ఇలా ఉండగా గత వారం ఈ స్టేడియంలో న్యూజిలాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఇందులో 115 పరుగులతో ఇంగ్లాండ్ విక్టరీ అందుకుంది.

Next Story