‘ది ప్యారడైజ్’కు సూపర్ ఆఫర్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్

by Pulgam srinivas |

‘ది ప్యారడైజ్’ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ సంస్థ, ఈ సినిమాను సెప్టెంబర్ నెలలో ఎప్పుడైనా విడుదల చేసుకునే అవకాశాన్ని చిత్రబృందానికి ఇచ్చినట్లు సమాచారం.

‘ది ప్యారడైజ్’కు సూపర్ ఆఫర్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్
X

దిశ, వెబ్ డెస్క్: నాని హీరోగా తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ సినిమా విడుదల తేదీపై మరోసారి ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. తొలుత ఈ చిత్రాన్ని మార్చి 26న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆ తేదీన సినిమా విడుదల కాలేదు. అనంతరం ఆగస్టు 21న పక్కాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆగస్టు 21న కూడా విడుదలయ్యే అవకాశాలు కనిపించడం లేదని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

దీంతో ఈ చిత్రం ఎప్పుడు విడుదల అవుతుందనే ఆసక్తి సాధారణ ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో కూడా నెలకొంది. ఇక తాజా సమాచారం ప్రకారం, ‘ది ప్యారడైజ్’ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ నెట్‌ఫ్లిక్స్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా విడుదల విషయంలో మేకర్స్‌కు సెప్టెంబర్ నెలలో అనుకూలమైన తేదీని ఎంపిక చేసుకునే అవకాశం ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో చిత్రబృందం కూడా సెప్టెంబర్‌లోనే సినిమాను విడుదల చేసే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

అయితే నెట్‌ఫ్లిక్స్ సూచించినట్లే ఈ సినిమా సెప్టెంబర్‌లో విడుదల అవుతుందా? లేక మరే ఇతర కారణాలతో విడుదల తేదీలో మరోసారి మార్పులు చోటుచేసుకుంటాయా? అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఇక ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించనుండగా, అనిరుద్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Next Story