- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డోప్ టెస్టులో ఫెయిల్.. పలువురు అథ్లెట్లపై నాడా నిషేధం
లాంగ్ డిస్టెన్స్ రన్నర్లు హేమ్‌రాజ్ గుర్జార్, అంజలి కుమారిలపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా)కుచెందిన యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్(ఏడీడీపీ) వేటు వేసింది.

దిశ, స్పోర్ట్స్ : లాంగ్ డిస్టెన్స్ రన్నర్లు హేమ్‌రాజ్ గుర్జార్, అంజలి కుమారిలపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ(నాడా)కుచెందిన యాంటీ డోపింగ్ డిసిప్లినరీ ప్యానెల్(ఏడీడీపీ) వేటు వేసింది. గతేడాది వీరు డోప్ టెస్టులో విఫలమవ్వగా తాజాగా చర్యలు తీసుకుంది. గతేడాది గుర్జార్ నుంచి సేకరించిన శాంపిల్‌లో నాడా నిషేధిత డార్బెపోయిటిన్‌ను గుర్తించింది. అప్పుడు తాత్కాలికంగా సస్పెండ్ చేయగా.. తాజాగా నాలుగేళ్ల నిషేధం విధించింది. అలాగే, అంజలిపై ఆరేళ్ల వేటు వేసింది. గుర్జార్, అంజలి గతేడాది వరల్డ్ అథ్లెటిక్స్ క్రాస్ కంట్రీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించారు. అలాగే, నాడా ఏడీడీపీ పలు అథ్లెట్లపై కూడా క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. కబడ్డీ ప్లేయర్ మనీష్ గులియా, రెజర్లు ఓంకార్ శంకర్, దివ్య కక్రాన్, బాక్సర్ తోక్చోమ్ యైసానా చాను, స్విమ్మర్ విశాల్ గ్రేవ్, ఓ మైనర్ బాక్సర్‌లను నాలుగేళ్లు బ్యాన్ చేసింది. పవర్ లిఫ్టర్ అమిత దేవితోపాటు మరో మైనర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్‌పై చెరో ఆరేళ్లు, బాక్సర్ ఆయుశ్ రాయ్, మిష్టి కాజ్లాపై రెండేళ్ల చొప్పున నిషేధం విధించింది.






