- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంబరాల కంటే ప్రాణాలు ముఖ్యం : కపిల్ దేవ్
రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటపై కపిల్ దేవ్ స్పందించాడు.

దిశ, స్పోర్ట్స్ : సంబరాల కంటే ప్రాణాలు చాలా ముఖ్యమైనవని భారత మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు. గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న కపిల్ దేవ్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు విజయోత్సవాల్లో చోటుచేసుకున్న తొక్కిసలాటపై స్పందించాడు. ఆ ఘటన తనను ఎంతో బాధకు గురిచేసిందన్నాడు. ‘మనం ఒకరి నుంచి ఒకరం నేర్చుకోవాలి. భవిష్యత్తులో ఇలాంటి విక్టరీ పరేడ్‌లు జరిగినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రజలు తప్పులు చేస్తారు. ప్రాణాలు కోల్పోయేంత పొరపాటు చేయకూడదు. భవిష్యత్తుల్లో ఏ జట్టైన గెలిస్తే కాస్త ప్రశాంతంగా ఉండండి. వేడుకల కంటే జీవితాలు ముఖ్యం.’అని కపిల్ దేవ్ తెలిపాడు.. అలాగే, ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశాడు. ‘భారత జట్టు బాగుంది. క్రికెట్ టీమ్ గేమ్. జట్టుగా ఆడితే కచ్చితంగా ఫలితం వస్తుంది. శుభ్‌మన్ గిల్, జస్ప్రిత్ బుమ్రా ఎవరైనా గానీ వ్యక్తిగతంగా కాకుండా టీమ్‌గా ఆడండి. సమిష్టిగా ఆడటం చాలా ముఖ్యం. విజయంతో తిరిగి వస్తారని ఆశిస్తున్నా.’అని చెప్పుకొచ్చాడు.






