ఇంగ్లాండ్ ను వాళ్ల సొంత గడ్డపై చిత్తు చేసిన మొనగాళ్లు వీళ్ళే.. ఇండియా నుంచి ఒక్కడేనా

by velandi.Saikiran |

ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య.. నేటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3:30

ఇంగ్లాండ్ ను వాళ్ల సొంత గడ్డపై చిత్తు చేసిన మొనగాళ్లు వీళ్ళే.. ఇండియా నుంచి ఒక్కడేనా
X

దిశ, వెబ్ డెస్క్ : ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య.. నేటి నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభమవుతుంది. గిల్ సారధ్యంలోని టీమిండియా... ఎలాగైనా.. చాలా కష్టపడుతుంది. నెట్స్ లో ప్రాక్టీస్ బాగా ప్రాక్టీస్ చేస్తోంది. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ లాంటి సీనియర్లు లేకున్నా సిరీస్ గెలవాలని.. ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇంగ్లాండ్ గడ్డపై 2000 నుంచి ఇప్పటివరకు... టెస్ట్ సిరీస్ గెలిచిన కెప్టెన్ల లిస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ లిస్టు ప్రకారం 2001 లో స్టీవా కెప్టెన్సీలో.. ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ తర్వాత 2007లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో టీమిండియా... అదిరిపోయే విజయాన్ని నమోదు చేసుకుంది. 2008, 2012లో స్మిత్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికా రెండు సిరీస్ లు గెలిచింది. 2014లో మ్యాథ్యూస్ కెప్టెన్సీలో శ్రీలంక గ్రాండ్ విక్టరీ కొట్టింది. కేన్ మామ కెప్టెన్సీలో న్యూజిలాండ్ కూడా విజయం సాధించింది. ఇక టీమ్ ఇండియా తరపున రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో మాత్రమే.... సిరీస్ గెలిచారు. ఈసారి గిల్ కెప్టెన్ గా ఉన్నాడు. మరి సిరీస్ గెలుస్తాడా లేదా చూడాలి.

Next Story