మెస్సీ భారత పర్యటనకు అక్షరాలా రూ.100 కోట్ల ఖర్చు?

by Naga Rani Yarlagadda |

సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే.

మెస్సీ భారత పర్యటనకు అక్షరాలా రూ.100 కోట్ల ఖర్చు?
X

దిశ, వెబ్‌డెస్క్: సాకర్ స్టార్ లియోనెల్ మెస్సీ ఇటీవల భారత్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. మెస్సీ పర్యటన కోసం అతనికి రూ.89 కోట్లు చెల్లించినట్లు ఈవెంట్ నిర్వాహకుడు శతద్రు దత్తా వెల్లడించారు. మెస్సీ కోల్ కతా పర్యటనలో చోటుచేసుకున్న ఘటనపై ఆయన అరెస్టై పోలీసుల కస్టడీలో ఉన్నాడు. విచారణలో శతద్రు మెస్సీ పర్యటన గురించి కీలక విషయాలు వెల్లడించాడని సమాచారం. పోలీసుల విచారణలో శతద్రు చెప్పిన విషయాల ప్రకారం.. మెస్సీ స్టేడియంలోకి రాగానే అనేకమంది తాకడం, కౌగిలించుకోవడం వంటి చర్యలు జరిగాయని, దాంతో అతను అసౌకర్యానికి గురయ్యాడని, అందుకే కేటాయించిన సమయం కంటే ముందుగానే అక్కడి నుంచి వెళ్లిపోయాడని చెప్పాడు.

కోల్ కతా ఈవెంట్లో మైదానంలోకి వచ్చేందుకు 150 మందికి మాత్రమే పాసులు ఉన్నాయని, అంతకు మూడింత మంది రావడంతో పరిస్థితి అదుపు తప్పందని తెలిపారు. మెస్సీ పర్యటనకు మొత్తం రూ.100 కోట్లు ఖర్చవ్వగా.. మెస్సీకి రూ.89 కోట్లు, భారత ప్రభుత్వానికి రూ.11 కోట్లు పన్నుగా చెల్లించామని తెలిపారు. ఈ నిధుల్లో 30 శాతం స్పాన్సర్ల ద్వారా, మరో 30 శాతం టిక్కెట్ల విక్రయం ద్వారా సేకరించామని చెప్పాడు.

Next Story