- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ జట్టు ఇదే.. 8 ఏళ్ల తర్వాత టెస్టు ఆడబోతున్న స్పిన్నర్
భారత్‌తో బుధవారం నుంచి జరగబోయే నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ సోమవారం తమ తుది జట్టును ప్రకటించింది.

దిశ, స్పోర్ట్స్ : భారత్‌తో బుధవారం నుంచి జరగబోయే నాలుగో టెస్టుకు ఇంగ్లాండ్ సోమవారం తమ తుది జట్టును ప్రకటించింది. తుది జట్టులో పెద్దగా మార్పులేమీ చేయలేదు. ఒకే ఒక్క మార్పుతో నాలుగో టెస్టులో ఆడనుంది. లార్డ్స్ టెస్టులో స్పిన్నర్ షోయబ్ బషీర్ ఎడమ చేతికి గాయమై విషయం తెలిసిందే. గాయం నుంచి కోలుకోకపోవడంతో బషీర్ నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. అతని స్థానంలో మరో స్పిన్నర్ లియామ్ డాసన్‌ను తుది జట్టులోకి వచ్చాడు.దీంతో 8 ఏళ్ల తర్వాత డాసన్ ఓ టెస్టు మ్యాచ్ ఆడబోతున్నాడు. అతను తన చివరి టెస్టును 2017లొ సౌతాఫ్రికాపై ఆడాడు. బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన డాసన్ రాకతో ఇంగ్లాండ్ బలం పెరిగినట్టే. ఇప్పటివరకు మూడు టెస్టుల ఆడిన అతను 7 వికెట్లు తీశాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అనుభవజ్ఞుడైన డాసన్ 212 మ్యాచ్‌ల్లో 10,731 రన్స్ చేయడంతోపాటు 371 వికెట్లు తీశాడు.
ఇంగ్లాండ్ తుది జట్టు
జాక్ క్రాలీ, బెన్ డక్కెట్, ఓలీ పోప్, జోరూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్, లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడెన్ కార్సే, జోఫ్రా ఆర్చర్.






