PKL : వేలంలో అన్‌సోల్డ్.. సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ కబడ్డీ ప్లేయర్

by Harish |

స్టార్ కబడ్డీ ప్లేయర్ పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

PKL : వేలంలో అన్‌సోల్డ్.. సంచలన నిర్ణయం తీసుకున్న స్టార్ కబడ్డీ ప్లేయర్
X

దిశ, స్పోర్ట్స్ : స్టార్ కబడ్డీ ప్లేయర్ పర్దీప్ నర్వాల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి గుడ్ బై చెప్పాడు. ఇటీవల జరిగిన ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 12వ సీజన్ వేలంలో నర్వాల్ అన్‌సోల్డ్‌గా మిగిలిపోయాడు. అతన్ని కొనుగోలు చేయడానికి ఏ జట్టు ఆసక్తి చూపించకపోవడంతో నర్వాల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ‘వేలం సమయంలో నాకు పెద్దగా ఏం అనిపించలేదు. ఏదో ఒక జట్టు తీసుకుంటుందిలే అనుకున్నా. పశ్చాతాపంతో ఈ నిర్ణయం తీసుకోలేదు. కబడ్డీ నాకు ఎంతో ఇచ్చింది. నా కుటుంబం కూడా ‘పేరు సంపాదించావు, ఎన్నో విజయాలు సాధించావు, సంతోషంగా ఉండు’అని చెప్పింది.’అని తెలిపాడు. ఆటకు వీడ్కోలు పలికినా కబడ్డీతో తన అనుబంధం కొనసాగుతూనే ఉంటుందన్నాడు. కోచింగ్‌పై ఫోకస్ పెట్టనున్నట్టు వెల్లడించాడు. హర్యానాకు చెందిన నర్వాల్ పీకేఎల్‌లో తనదైన ముద్ర వేశాడు. గ్రేటెస్ట్ రైడర్‌గా గుర్తింపు పొందాడు.‘డబ్కీ కింగ్’గా అతన్ని పిలిచేవారు. పాట్నా పైరేట్స్ వరుసగా మూడుసీజన్లు టైటిల్ గెలవడంలో అతని పాత్ర ఎంతో ఉంది. మొత్తం 190 పీకేఎల్ మ్యాచ్‌ల్లో 1801 పాయింట్స్ సాధించాడు. పీకేఎల్‌లో అత్యధిక రైడ్ పాయింట్లు సాధించిన రికార్డు నర్వాల్ పేరిటే ఉంది.


Next Story