Cricketer Syed Abid Ali : భారత లెజెండరీ క్రికెటర్ మృతి

by Muthe.Rajitha |   (  Updated:2025-03-12 12:51:08  IST  )

భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు(Cricketer Syed Abid Ali Passed Away).

Cricketer Syed Abid Ali : భారత లెజెండరీ క్రికెటర్ మృతి
X

దిశ, వెబ్ డెస్క్ : భారత దిగ్గజ మాజీ క్రికెటర్ సయ్యద్ అబిద్ అలీ కన్నుమూశారు(Cricketer Syed Abid Ali Passed Away). తెలంగాణలోని హైదరాబాద్(Hyderabad) కు చెందిన ఆయన ప్రస్తుతం అమెరికాలోని కాలిఫోర్నియాలో నివాసం ఉంటున్నారు. గత కొంతకాలంగా అబిద్ అలీ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఇటీవల పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నేడు మృతి చెందారు. 1941లో అప్పటి నిజాం రాష్ట్రంలోని హైదరాబాద్ లో జన్మించిన సయ్యద్ అబిద్ అలీ.. భారత క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. 1967-1975 కాలంలో భారత జట్టులో కీలక ఆటగాడిగా సేవలు అందించారు.

లోయర్ ఆర్డర్ బ్యాట్స్ మన్, మీడియం పేసర్ అయిన ఆయన.. 1971లో ఒవెల్ టెస్టు గెలిచి చరిత్ర సృష్టించిన జట్టులో కీలక సభ్యుడు. 1959 - 1979 వరకు హైదరాబాద్ తరపున రంజీల్లో పాల్గొని పలు రికార్డులు సాధించారు. ఆ తర్వాత భారత జట్టుకు ఎంపికై.. పటౌడీ కెప్టెన్సీలో జట్టు పలు విజయాలను సాధించడంలో ముఖ్యపాత్ర పోషించారు. 1967 లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచులో 6/55 తో అద్భుత ప్రదర్శన చేశాడు. అబిద్ తన కెరీర్లో మొత్తం 29 టెస్టు మ్యాచులు ఆడి.. 47 వికెట్లు తీసుకున్నాడు.

Next Story